Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో మెగా మాన్‌సూన్‌ సేల్ ప్రారంభం !


ఫ్లిప్ కార్ట్ నేటి నుంచి మెగా మాన్సూన్ సేల్ తో మరో సారి వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్ ఈ నెల 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో టీవీలు మరియు ఇతర అప్లియెన్సెస్ పై ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలను కేవలం నెలకు రూ.1,250 ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. వాషింగ్ మిషన్లను రూ.239, రిఫ్రిజిరేటర్లను రూ.791 ఈఎంఐ ఆఫర్లతో సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఎయిర్ కండిషనర్లను సైతం నెలకు రూ.2499తో ప్రారంభమయ్యే ఆఫర్ తో సొంతం చేసుకోవచ్చు. ఫ్యాన్లు, గీజర్లు నెలకు రూ.999 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. హోం అప్లియెన్సెస్ పై 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. మైక్రోవేవ్ లపై 45 శాతం డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ లో బెస్ట్ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తో కొనుగోలు చేయడం ద్వారా 10 శాతం వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆఫర్ ను సొంతం చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu