Ad Code

చంద్రుడిపై నుంచి ల్యాండర్‌ బయటకొచ్చిన వీడియోను ఇస్రో షేర్‌ చేసింది !


రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్‌ ల్యాండర్‌ ను దించి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై కాలు మోపి సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ఇది ల్యాండర్‌ ర్యాంపు ద్వారా వడివడిగా బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అంతకుముందు చంద్రయాన్ 2 ఆర్బిటార్ తీసిన విక్రమ్​ ల్యాండర్​ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్టులను మళ్లీ డిలీట్ చేసింది. కానీ ఎందుకు డిలీట్ చేసిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక చంద్రయాన్‌-3ని విజయవంతం అవ్వడం పట్ల ప్రపంచ దేశాలు భారత్‌ కృషిని కొనియాడుతున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్‌ఫుల్ ల్యాండింగ్ కాగానే ప్రపంచ నాయకులు, శాస్త్రవేత్తలు ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu