Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, August 1, 2023

అంతరిక్షంలోకి చేపలను పంపనున్న చైనా !


జీవ చేపను అంతరిక్షంలోకి పంపనున్నట్టు చైనా ప్రకటించింది. వాస్తవానికి, చైనా ఇప్పుడు అంతరిక్షంలో పెద్ద శక్తిగా మారాలని కోరుకుంటోంది. అందుకే అంతరిక్షంలో వివిధ రకాల పరిశోధనలు చేస్తోంది. స్పెస్ డాట్ కమ్‌లో ప్రచురించబడిన ఒక వార్త అందిచిన సమాచారం ప్రకారం, చైనా ఒక పరిశోధన కోసం చేపలను అంతరిక్షంలోకి పంపుతోంది. వాస్తవానికి, అంతరిక్ష కేంద్రం వంటి క్లోజ్డ్ ఎకోసిస్టమ్‌లో చేపల ఎముకలు ఎలా ప్రభావితమవుతాయో చూడాలని చైనా కోరుకుంది. అంతరిక్ష కేంద్రంలో నివసించే మానవులపై ఆ వాతావరణం ఎలాంటి ప్రభావం చూపుతుందో  తెలుసుకోవచ్చునని చైనా అభిప్రాయం.  అయితే, ఇలాంటి ప్రయోగం చేస్తున్నది చైనా మొదటిది కాదు.. ఇంతకు ముందు చాలా దేశాలు అంతరిక్షంలోకి ఇలాంటి వాటిని పంపాయి. చైనా కంటే ముందే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా చేపలను అంతరిక్షంలోకి పంపింది. 2012లో జపాన్‌కు చెందిన ఓ చేపను నాసా అంతరిక్షంలోకి పంపింది. సముద్ర జీవులపై మైక్రోగ్రావిటీ ప్రభావం ఏంటో కనుక్కోవడానికి ఇలా చేసారు. దీనికి ముందు, సోవియట్ యూనియన్ 1976 సంవత్సరంలో కూడా ఒక జీబ్రాఫిష్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ పరిశోధనలో సోవియట్ యూనియన్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో నివసించిన తర్వాత ఈ చేప ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కనుగొన్నారు.    https://t.me/offerbazaramzon


No comments:

Post a Comment

Popular Posts