Ad Code

తమిళనాడులో యాపిల్ తయారీ సంస్థ


మిళనాడు సమీపంలోని శ్రీపెరంబుదూర్ ఫెసిలిటీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. భారతదేశం నుండి ఇతర దేశాలకు దాని ఎగుమతులను పెంచడానికి ఫాక్స్‌కాన్ ఈ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో యాపిల్ భారతదేశంలోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో సిరీస్ 14ని అసెంబ్లింగ్ మొదలుపెట్టింది. చైనాలో జరిగిన వారం రోజుల్లోనే భారత్‌లో అసెంబ్లింగ్ ప్రారంభమైంది. కాగా ఇప్పుడు ఈ సంస్థ భారతదేశం మరియు చైనా నుండి ఒకేసారి ఐఫోన్ 15 ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యాపిల్ తయారీ ఉత్పత్తిని భారత్ లో ప్రారంభించడం పరిశ్రమ వర్గాలు మరోలా కూడా భావిస్తున్నాయి. చైనాతో ఎప్పటికైనా ప్రమాదమే అని ఆ సంస్థ భావిస్తోందట. అందుకే భారత్ అయితే ఎలాంటి సమస్య ఉండదని భావించి భారత్ లో తమ ఉత్పత్తులని ప్రారంభించేందుకు మొగ్గు చూపినట్టు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu