Ad Code

ఇన్‌స్టాగ్రామ్‌లో లాస్ట్ సీన్ హైడ్ చేయొచ్చు !


సోషల్ మీడియాలో యాక్టివిటీ స్టేటస్ కనిపిపంచకూడదని భావిస్తారు. అంటే తాము సోషల్ మీడియాలో ఉన్నా కూడా వేరే వ్యక్తికి తెలియకూడదనుకుంటారు. సాధారణంగా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫారం అయినా ఆ యాప్ లో మీరు ఉంటే అది యాక్టివిటీ స్టేటస్ ను చూపిస్తుంది. అంటే ఆన్ లైన్లో ఉన్నట్లు చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివిటీ స్టేటస్ అనేది వ్యక్తులను అకౌంట్లను ఫాలో అవడానికి, అలాగే వారు ఆన్ లైన్లో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫేస్ బుక్ మెస్సేంజర్, వాట్సాప్ లలో ఉండే ఫీచర్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో మీ ప్రైవసీని మీరు కాపాడుకోవచ్చు. మీరు యాప్ లో ఉన్నారో లేదో అంటే ఆన్ లైన్ లో ఉన్నారో లేదో బయటి వ్యక్తులకు తెలియకుండా కాపాడుతుంది. మొదటిగా మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ ఓపెన్ చేసి దానిలో మీ ప్రొఫైల్ ని యాక్సెస్ చేసేందుకు యాప్ లో కుడిచేతి వైపు కింద ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ప్రొఫైల్ పేజీలో కుడి చేతి వైపు పైన ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయాలి. వచ్చిన ఆప్షన్లలో నుంచి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ లోకి వెళ్లాలి. దానిలో మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్ సెక్షన్ లోకి వెళ్లి షో యాక్టివిటీ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దానిని స్విచ్ ను ఆఫ్ చేసేయాలి.  అలా చేస్తే మీరు యాప్ ఉన్నప్పటికీ మీ స్టేటస్ చూపించదు. దీని ద్వారా మీ ఆన్ లైన్ స్టేటస్ బయటి వ్యక్తులకు కనిపించదు. మీ ప్రైవసీ భద్రంగా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu