Ad Code

వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్‌కు అవతార్స్‌తో రిప్లై ఇచ్చే ఆప్షన్ !


వాట్సాప్ రీసెంట్ టైమ్‌లో వీడియో మెసేజెస్, స్క్రీన్ షేరింగ్, HD వీడియో షేరింగ్ వంటి స్పెసిఫికేషన్స్ పరిచయం చేసింది. వీటితో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపడింది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్ డెవలప్ చేస్తోందని వాట్సాప్ ట్రాకర్ WABetaInfo లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది. అదే అవతార్ రిప్లై-స్టేటస్ అప్‌డేట్స్‌. ఈ అప్‌కమింగ్ స్పెసిఫికేషన్‌తో యూజర్లు అవతార్స్‌తో ఏదైనా స్టేటస్ అప్‌డేట్‌కు రిప్లై ఇవ్వవచ్చు. వాట్సాప్ స్టేటస్‌లకు ఎమోజీలతో రియాక్ట్ అయ్యే ఆప్షన్‌ను కొన్ని నెలల క్రితమే తీసుకొచ్చింది. త్వరలోనే దానికి ఎడిషనల్‌గా అవతార్ రిప్లై ఫీచర్ పరిచయం చేయనుంది. ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న ఈ స్పెసిఫికేషన్ యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. స్టేటస్ అప్‌డేట్లకు రిప్లై ఇవ్వడానికి వాట్సాప్ కొత్తగా అవతార్స్‌ జోడిస్తోందని, ఎమోజీకి బదులుగా అవతార్‌తో రిప్లై ఇవ్వవచ్చని WABetaInfo తెలిపింది. సాధారణ రియాక్షన్ ఫీచర్‌లోని 8 ఎమోజీలతో సహా, 8 అవతార్లు అందుబాటులోకి వస్తున్నందున యూజర్లు వారి ఫీలింగ్స్ సులభంగా, కచ్చితంగా ఎక్స్‌ప్రెస్ చేయడం కుదురుతుందని రిపోర్ట్ పేర్కొంది.

స్టేటస్ ట్యాబ్‌లో ఏదైనా ఒక స్టేటస్‌కు అవతార్‌తో రిప్లై ఇవ్వడానికి, రిప్లై బటన్‌పై నొక్కాలి. స్క్రీన్ పై భాగంలో ఎమోజీ ఐకాన్‌ మాత్రమే కాకుండా అవతార్స్‌ ఐకాన్ కనిపిస్తుంది. అవతార్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి ఉపయోగించాలనుకుంటున్న అవతార్‌పై ట్యాప్ చేస్తే చాలు స్టేటస్ పోస్ట్ చేసిన వ్యక్తికి అవతార్ సెండ్ అయిపోతుంది. స్టేటస్ అప్‌డేట్స్‌కు సొంత అవతార్స్‌తో రిప్లై ఇవ్వడం ద్వారా భావాలను మరింత క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కుదురుతుంది. ఎమోజీలు, అవతార్స్‌తో రిప్లై ఇచ్చుకోగల ఫెసిలిటీస్‌ వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాట్సాప్‌లోని అవతార్ అనేది యూజర్‌కు డిజిటల్ వెర్షన్‌గా ఉంటుంది. దీనిని ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇది విభిన్నమైన హెయిర్ స్టైల్స్, ఫేసియల్ ఫీచర్స్‌, దుస్తులతో కూడిన కోట్ల కాంబినేషన్స్ నుంచి క్రియేట్ చేసుకునే పర్సనలైజ్డ్‌ అవతార్. ఒక్కసారి అవతార్ సెట్ చేసుకుంటే ఆ అవతార్‌తో విభిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టిక్కర్లు క్రియేట్ అవుతాయి. ఎమోజీ సెక్షన్‌లో వీటిని యాక్సెస్ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu