Ad Code

టైప్-C ఛార్జింగ్ పోర్టుతో ఐఫోన్ 14 సిరీస్ మోడల్ రీఎంట్రీ !


పిల్ ఐఫోన్ 14 మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి.. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను USB టైప్-C ఛార్జింగ్‌తో ఈయూ నిబంధనలకు అనుగుణంగా తీసుకురావచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఐఫోన్ 14 ప్రస్తుత మోడల్‌లలో కొన్ని కొత్త ఛార్జింగ్ పోర్ట్‌లతో మళ్లీ మార్కెట్లోకి రానున్నాయని కొత్త నివేదికలు సూచిస్తున్నాయి. ఆపిల్ అభిమానులు లేటెస్ట్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరులో ఐఫోన్ 15 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ మోడల్ USB-C ఛార్జింగ్‌ పోర్టులతో రానుంది. లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా iPhone 15 మోడల్ రానుందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. ఐఫోన్ యూజర్ @aaronp613 చేసిన ఒక ట్వీట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. TVOS17 బీటా కోడ్‌లో ఐఫోన్ 15 మాత్రమే కాకుండా మరో పాత మోడల్ ఫోన్లు ఉన్నాయని పోస్ట్ వెల్లడించింది. అందులో మరో రెండు ఐఫోన్ 14 మోడల్స్, iPhone 14, iPhone 14 Plus ఉంటాయని నివేదిక తెలిపింది. ముఖ్యంగా, ఈ డెవలప్‌మెంట్ ఐఫోన్ 15 అరంగేట్రంపై ఆపిల్ ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ మోడళ్లను నిలిపివేయనుందని సూచిస్తుంది. అయినప్పటికీ, 2018లో ఆపిల్ ఐప్యాడ్ ప్రోతో USB-C ఛార్జింగ్‌ను ప్రవేశపెట్టగా.. అన్ని ఐప్యాడ్ మోడల్‌లు USB-C ఛార్జింగ్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఐఫోన్ లైటనింగ్ పోర్ట్‌కు ఇంటిగ్రేట్ అయి ఉంది. ఈ మార్పుకు యూరోపియన్ యూనియన్ (EU) నిబంధనలే కారణమని చెప్పవచ్చు. USB-C ఛార్జింగ్ పోర్టులపై గత సంవత్సరమే అమలు చేయగా, టెక్ దిగ్గజాలను 2024 నాటికి ఈ నిబంధలను పాటించాలని లేదంటే ఈయూ మార్కెట్‌లో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించింది.

Post a Comment

0 Comments

Close Menu