Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, August 18, 2023

బిఎస్ఎన్ఎల్ FTTH యూజర్లకు ఉచిత ఆఫర్ !


బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఈ అద్భుతమైన ఉచిత అఫర్ ని అనౌన్స్ చేసింది. అతి తక్కువ ధరలో ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ ను 100 Mbps కు ఉచితంగా పెంచుకునే అద్భుతమైన అఫర్ ను కూడా అందించింది. అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ కొత్త ఉచిత అప్గ్రేడ్ అఫర్ ను బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అందించింది. భారత్ ఫైబర్ అమృత్ ఉత్సవ్ లో భాగంగా ఈ అఫర్ ను లాంచ్ చేసింది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ అఫర్ ద్వారా నిర్ణిత కాలానికి గాను ఇంటర్నెట్ స్పీడ్ ను 100 Mbps కు పెంచుకోవచ్చు. ఎటువంటి అధనపు రుసుమును లేదా చార్జీలు చెల్లించే పని లేకుండానే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు వారి బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ ను 100 Mbps వేగంతో పొందవచ్చు. అయితే, ఈ ఉచిత స్పీడ్ ఇంటర్నెట్ కేవలం 10 రోజులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఒక 10 రోజులు మీ ఇంటర్నెట్ స్పీడ్ ను ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా 100 Mbps కు పెంచుకొని ఆనందించవచ్చు. ఈ అవకాశం సద్వినియోగం చేయదలచుకున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ FTTH బ్రాండ్ బ్యాండ్ యూజర్లు my BSNL App ద్వారా వారి FTTH (ఫైబర్ టు ది హోమ్) కనెక్షన్ నంబర్ ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ FTTH బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కలిగిన ప్రతీ కస్టమర్ ఈ 10 రోజుల ఉచిత స్పీడ్ ఇంటర్నెట్ ను అందుకోవచ్చు. 

No comments:

Post a Comment

Popular Posts