Ad Code

'X'లో నెంబర్ అవసరం లేకుండా వీడియో కాల్ ఫీచర్ !


ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌ను సూపర్ యాప్‌గా మార్చేందుకు మరో అడుగు ముందుకు పడింది. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారంలో త్వరలోనే వీడియో కాలింగ్ ఫీచర్‌ను తీసుకు రానున్నట్లు కంపెనీ సీఈవో లిండా యాకరినో వెల్లడించారు. సీఎన్‌బీసీతో ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో పాటు డిజిటల్ పేమెంట్స్‌ ఇంట్రడ్యూస్ చేసేందుకు కూడా చర్చలు జరుపుతున్నట్లు లిండా యాకరినో తెలిపారు. ప్రస్తుతం ఎక్స్ యాప్‌లో జరుగుతున్న బిజినెస్, రాబోయే ఆవిష్కరణల గురించి ఆమె మాట్లాడారు. మిగతా ప్లాట్‌ఫారంలలో అవతలి వ్యక్తికి వీడియో కాల్ చేయాలంటే ఒకరి నంబర్ మరొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. కానీ, ఎక్స్ యాప్‌లో మాత్రం నంబర్‌తో పనిలేదు. ఇతరులకు నంబర్ ఇవ్వకుండానే వీడియో కాల్ మాట్లాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు సీఈవో వెల్లడించారు. ఫలితంగా, యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు దోహద పడుతుందన్నారు. దీంతో పాటు ఇటీవల తీసుకొచ్చిన సరికొత్త సబ్‌స్క్రిప్షన్ బిజినెస్ క్రమంగా వృద్ధి చెందుతోందని లిండా తెలిపారు. కంటెంట్ క్రియేటర్లకు ఎక్స్‌టెండెడ్ వీడియోస్, సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు ఫీచర్లపై లిండా చర్చించారు.  'వీ చాట్' సూపర్ యాప్‌గా పనిచేస్తోంది. సరిగ్గా వీ చాట్ మాదిరే ఎక్స్ యాప్‌ని తీర్చిదిద్దాలని అధినేత ఎలాన్ మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగా తగు సంస్కరణలు తీసుకొస్తున్నారు. భవిష్యత్తులోనూ ఎక్స్ ప్లాట్‌ఫారంలో డిజిటల్ పేమెంట్స్ సేవలను పొందవచ్చని తాజాగా సీఈవో లిండా వెల్లడించారు. ప్రస్తుతానికి దీనిపై మేధోమథనం జరుపుతున్నట్లు తెలిపారు. ఎక్స్‌ని సూపర్ యాప్‌గా మలచడమే తమ లక్ష్యమని లిండా మరోసారి నొక్కి చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu