Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, August 9, 2023

కవాసాకి నుంచి Z900RS 2024 బైక్‌ను విడుదల


దేశీయ మార్కెట్‌లోకి కవాసాకి ఇండియా Z900RS 2024 బైక్‌ను విడుదల అయింది. దీని ధరను రూ. 16.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. జెడ్‌ 900ఆర్‌ఎస్‌ 2024 మోడల్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్ పెయింట్ థీమ్‌లో లభిస్తుంది. 2024 మోడల్‌ బైక్‌లోదాదాపు పాత ఫీచర్లనే అందించింది.ముందు భాగంలో రౌండ్ హెడ్‌లైట్, ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టియర్-డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ సాడిల్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్,, రెండు చివర్లలో స్పోక్-స్టైల్ కాస్ట్ వీల్స్. 2024 మోడల్‌బైక్‌లో ఫుల్-LED లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-ఛానల్ ABS, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ , అసిస్ట్ , స్లిప్పర్ క్లచ్ మెకానిజంతో తీసుకొచ్చింది. హార్డ్‌వేర్‌లో ట్విన్ 300mm ఫ్రంట్ డిస్క్‌లు, సింగిల్ 250mm రియర్ రోటర్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ,రియర్ మోనోషాక్ ఉన్నాయి. 948cc, ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటి. సిక్స్‌-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడిన ఈ మోటార్ గరిష్టంగా 8,500rpm వద్ద 107bhp , 6,500rpm వద్ద 95Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఇంజన్ సరికొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.భారత మార్కెట్లో ట్రయంఫ్ బోన్నెవిల్లే T100 ,స్పీడ్ ట్విన్ వంటి వాటికి గట్టిపోటి ఇవ్వనుందని మార్కెట్‌ అంచనాలు.

No comments:

Post a Comment

Popular Posts