Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, September 12, 2023

వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలకానున్న వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్‌ !


న్‌ప్లస్ 12R ఫోన్ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అవుతుంది. అయితే కంపెనీ వచ్చే జనవరిలోనే దీన్ని చైనాలో 'Ace 3' పేరుతో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCతో వస్తుందని, దీంట్లో ఏకంగా 5,500mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉందని యోగేష్ తెలిపారు. ఇది ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుందని వెల్లడించారు. వన్‌ప్లస్ 12R ఫోన్ 50 మెగాపిక్సెల్ (OIS), 8 మెగాపిక్సెల్ (UW), 32-మెగాపిక్సెల్ టెలీ ఫోటో లెన్స్‌ ఉన్న రియర్ కెమెరా సిస్టమ్‌తో రానుంది. కానీ R-సిరీస్ ఫోన్లలో హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరాలు ఉండవు. సెల్ఫీల కోసం ఈ డివైజ్‌లో 16-మెగాపిక్సెల్ షూటర్ ఉండనుంది. డివైజ్‌లో 32-మెగాపిక్సెల్ టెలికెమెరాకు బదులుగా సబ్-స్టాండర్డ్ మాక్రో కెమెరా ఉంటుందని ఆ రిపోర్ట్ పేర్కొంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ఆండ్రాయిడ్ 14, స్టీరియో స్పీకర్లు, 120Hz 6.7-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లై, అలర్ట్ స్లైడర్ వంటి ఇతర ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ రానుంది. మరోవైపు, అధికారిక ప్రకటనకు ముందే నెక్స్ట్ జనరేషన్ OnePlus 12 స్మార్ట్‌ఫోన్ గురించి కూడా లీక్‌లు వైరల్ అవుతున్నాయి. నివేదికల ప్రకారం.. ఇది వన్‌ప్లస్ 12R వేరియంట్‌ను పోలి ఉండవచ్చు. కానీ బిల్డ్ క్వాలిటీ మారవచ్చు. ఇది 16GB LPDDR5X RAM, 256GB UFS 4.0 స్టోరేజ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 64-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్న రియర్ కెమెరా సిస్టమ్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.. వంటి స్పెసిఫికేషన్లతో రావచ్చు. వన్‌ప్లస్ 12R మాదిరిగానే, వన్‌ప్ల 12 కూడా పెద్ద బ్యాటరీతో రావచ్చని భావిస్తున్నారు. దీంట్లో 100W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,400mAh బ్యాటరీ ఉండవచ్చు. ఇది 50W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌కు సైతం సపోర్ట్ చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment

Popular Posts