Ad Code

ఐఫోన్15లో NavIC టెక్నాలజీ !


ఫోన్15  ప్రో, ఐఫోన్15 ప్రో మాక్స్  ఫోన్లలో దేశీయ టెక్నాలజీ అయిన నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ ని తీసుకువస్తుంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్  అనేది ఇండియా స్వతహాగా రూపొందించుకున్న జీపీఎస్ లాంటి నావిగేషస్ టెక్నాలజీ. దేశీయ టెక్నాలజీని ఐఫోన్లలో తీసుకురావడం ఇదే తొలిసారి. అయితే ఐఫోన్ 15, ఐపోన్ 15 ప్లస్ వెర్షన్లలో మాత్రం ఈ టెక్నాలజీ పనిచేయదు. ఐఫోన్ 15లో NavIC తో పాటు గెలీలియో, GLONASS వంటి జీపీఎస్ సిస్టమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అమెరికా, రష్యా, చైనాలకు ఉన్నవిధంగానే భారత్ కు కూడా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అవసరం ఉందని ఇస్రో భావించి NavIC వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఇది ఇండిపెండెంట్ స్టాండ్-లోనే నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. 2006లో ప్రారంభమైన నావిక్, 2011లో ప్రారంభమవుతుందని అంచనా వేసినప్పటికీ, 2018లో ప్రారంభమైంది. ఇది ఇండియా కొరకు పనిచేసే ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ. నావిక్ శాటిలైట్ వ్యవస్థని ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం చాలా దేశాలు అమెరికా నావిగేషన్ వ్యవస్థ అయినటువంటి GPSని కలిగి ఉంటుంది. ఇదే విధంగా భారత్ కూడా తన దేశ అవసరాలకు, రక్షణకు ఉద్దేశించి నావిక్ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని కోసం 7 శాటిలైట్లు పనిచేస్తాయి. ప్రస్తుతం నావిక్ దేశంలో పబ్లిక్ వెహికిత్ ట్రాకింగ్‌లో ఉపయోగించబడుతోంది. ఇది కాకుండా, సముద్రంలో వెళ్లే మత్స్యకారులకు అత్యవసర హెచ్చరికలు అందించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. నావిక్ ప్రకృతి విపత్తులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ 7 శాటిలైట్లు, గ్రౌండ్ స్టేషన్లు 24/7 పనిచేస్తాయని ఇస్రో తెలిపింది. ఈ 7 శాటిలైట్లలో 3 'జియో స్టేషనరీ ఆర్బిట్(భూస్థిర కక్ష్య)'లో, మరో 4 జియో సింక్రోనస్ కక్ష్యలో ఉన్నాయి. నావిక్ శాటిలైట్ వ్యవస్థ రెండు రకాల సేవల్ని అందిస్తోంది. SPS (స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్) పౌర సేవల కోసం, RS (నియంత్రిత సేవ) వ్యూహాత్మక ప్రయోజనాల కోసం. ఈ వ్యవస్థ దేశంతో పాటు దేశ సరిహద్దుల నుంచి 1500 కి.మీ వరకు కవరేజ్ చేస్తుంది. నావిక్ 20 మీటర్ల కంటే మెరుగైన ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. 50 ns కంటే మెరుగైన టైమ్ ఆక్యురసీని అందిస్తుంది. నావిక్ SPC సిగ్నల్స్ జీపీఎస్, GLONASS, గెలీలియో, బీడౌ అనే ఇతర గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) సిగ్నల్‌లతో పరస్పరం పనిచేయగలవు

Post a Comment

0 Comments

Close Menu