Ad Code

జీప్ కంపాస్‌ 2023 మోడల్‌ ఆవిష్కరణ !


జీప్ ఇండియా తాజాగా కొత్త కారు జీప్ కంపాస్‌ 2023 మోడల్‌ను ఆవిష్కరించింది. గత మోడళ్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. జీప్ కంపాస్ 2023 మోడల్ ధర ఇప్పుడు రూ.20.49 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఎంట్రీ లెవెల్ కారు ధర దాదాపు రూ.లక్ష వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆటోమెటిక్ రేంజ్ కారు ధర అయితే రూ. 23.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతోంది. ఇది కూడా ఎక్స్‌షోరూమ్ ధరనే. గత మోడల్‌తో పోలిస్తే.. దీని రేటు ఏకంగా 20 శాతం మేర దిగి వచ్చింది. అంటే ఆటోమెటిక్ వేరియంట్ ఇప్పుడు కస్టమర్లకు మరింత అందుబాటు ధరకే వస్తోందని చెప్పుకోవచ్చు. దీని ధర దాదాపు రూ. 6 లక్షల వరకు తగ్గింది. జీప్ ఇండియా అలాగే మరో కొత్త వేరియంట్ కూడా తెచ్చింది. జీప్ మెరిడియన్ ఓవర్ ల్యాండ్ ఎడిషన్ ఎస్‌యూవీని తీసుకువచ్చింది. ఇందులో స్ట్రైకింగ్ అప్‌డేట్స్ ఉన్నాయి. కొత్త అలాయ్ వీల్స్, అప్‌డేటెడ్ గ్రిల్ ప్యాట్రన్, బాడీ కలర్డ్ బంపర్స్, ఫ్రెష్ అప్‌హోల్‌స్టీరీ ఇన్‌సైడ్ వంటివి ఉన్నాయి. అయితే కంపెనీ ఈ కొత్త జీప్ మెరిడియన్ వేరియంట్ ధరను ప్రకటించలేదు. జీప్ కంపాస్ 2023 మోడల్‌లో గ్లాసీ బ్లాక్ గ్రిల్, గ్లాసీ బ్లాక్ 18 ఇంచుల అలాయ్ వీల్స్, ఫ్రంట్ ఎల్ఈడీ రిఫ్లెక్టర్ హెడ్ లైట్స్, స్టాండర్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి. బ్లాక్ షార్క్ ఎడిషన్‌లో అయితే బాడీ కలర్ పెయింటెడ్ రూఫ్, లోయర్ క్లాడింగ్, స్ట్రైకింగ్ 18 ఇంచుల అల్యూమినియం బ్లాక్ గ్లాసీ పెయింటెడ్ వీల్స్, బ్లాక్ లెదర్ సీట్స్, యూనిక్యూ ఇగ్నైట రెడ్ హైలైట్స్ వంటివి ఉన్నాయి. ఈ కారులో 10.1 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచుల ఫ్రేమ్‌లెస్ ఫుల్లీ కలర్డ్ డిజిటల్ టీఎఫ్‌టీ గేజ్ క్లస్టర్, పానారామిక్ సన్ రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్ పాడ్, 2 లీటర్ ఇన్‌జెక్టెడ్ టర్బో చార్జ్ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజని, 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ లేదా 9 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్, ఇంజిన్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 9.8 సెకన్లలోనే అందుకుంటుంది.

Post a Comment

0 Comments

Close Menu