Ad Code

గూగుల్ 25వ వార్షికోత్సవం !


రోజు గూగుల్ 25వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వాస్తవానికి 1998, సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని స్థాపించారు. అప్పట్లో కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే సెర్గీ బ్రిన్, లారీ పేజ్ అనే అమెరికన్ సైంటిస్టులు గూగుల్‌ను స్థాపించారు. అప్పటి నుంచి గూగుల్ యూట్యూబ్ నుంచి ఆండ్రాయిడ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్ వరకు ప్రపంచవ్యాప్తంగా వందలాది సర్వీస్‌లను అందిస్తోంది. గూగుల్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక డూడుల్  పెట్టుకుంది. సెర్గీ బ్రిన్, లారీ పేజ్ మొదటిసారి జనవరి 1997లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో కలుసుకున్నారు. ఈ సమావేశం సమయానికి సెర్గీ బ్రిన్ అదే యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థిగా ఉన్నారు. ఉన్నత చదువుల కోసం స్టాన్‌ఫోర్డ్ వెళ్లేందుకు సిద్ధమైన లారీ పేజ్ తనను క్యాంపస్‌కు తీసుకెళ్లమని సెర్గీ బ్రిన్‌ని అడిగారు. ఒక ఏడాది తర్వాత, ఇద్దరూ కలిసి సెర్చ్ ఇంజన్‌ని అభివృద్ధి చేసేందుకు తమ డార్మిటరీ రూంలో కలిసి పనిచేయడం ప్రారంభించారు. మొదటి మోడల్ విజయవంతంగా క్రియేట్ చేయడంతో సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఆగష్టు 1998లో, సన్ మైక్రోసిస్టమ్స్ సహ-వ్యవస్థాపకుడు ఆండీ బెచ్టోల్‌షీమ్, సెర్గీ బ్రిన్, లారీ పేజ్‌లకు లక్షల డాలర్ల చెక్కును అందించారు. అప్పుడే గూగుల్ పేరంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కీలక పెట్టుబడితో కొత్తగా టీమ్ ఏర్పడింది. ఆ తర్వాత గూగుల్ కంపెనీ మొదటి కార్యాలయానికి తరలివెళ్లింది. కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ శివారులోని గ్యారేజీలోనే గూగుల్ మొదటి ఆఫీసుగా మారింది. ఆ తరువాతి సంవత్సరాల్లో, గూగుల్ వేగవంతమైన వృద్ధిని సాధించింది. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో ‘గూగుల్‌ప్లెక్స్’గా ప్రసిద్ధి చెందిన ప్రస్తుత ప్రధాన కార్యాలయానికి మారింది. అలా గూగుల్ 25ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనిపై గూగుల్ ఒక బ్లాగ్ పోస్టులో.. ఇద్దరు కంప్యూటర్ శాస్త్రవేత్తల మధ్య జరిగిన ఒక సమావేశం.. ఇంటర్‌నెట్ గమనాన్ని మిలియన్ల మంది జీవితాలను మార్చిందని తెలిపింది. గూగుల్ ప్రతిరోజు, ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ భాషలలో గూగుల్ బిలియన్ల కొద్దీ శోధనలు జరుగుతున్నాయి. గూగుల్ ప్రారంభ రోజుల నుంచి చాలా మారినప్పటికీ మొదటి సర్వర్ నుంచి టాయ్ బ్లాక్‌లతో నిర్మించిన క్యాబినెట్‌లోనే కొనసాగుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 కన్నా ఎక్కువ డేటా సెంటర్లలో సర్వర్‌లకు, ప్రపంచ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం అలాగే కొనసాగిస్తోంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 24/7 ఇంటర్నెట్ లభ్యతను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్‌లను నిర్వహిస్తోంది. విశేషమేమిటంటే గూగుల్ సెర్చ్ ఇండెక్స్ వందల కోట్ల ఆన్‌లైన్ పేజీలను విస్తరించింది. అది క్రమంగా 10కోట్ల  గిగాబైట్‌ల కన్నా ఎక్కువ పరిమాణాన్ని మించిపోయింది. మొదటి సెర్చ్ ఇంజిన్ ప్రోటోటైప్‌గా మొదలైన గూగుల్ గణనీయమైన తన పరిధిని మరింత విస్తరించింది.

Post a Comment

0 Comments

Close Menu