Ad Code

రూ.3.5 లక్షలకే ఎలక్ట్రిక్ కారు !


మైక్రో ఈవీ విభాగంలో అధిక మార్కెట్ వాటా లక్ష్యంతో ఫస్ట్ ఆటో వర్క్స్ (ఎఫ్ఏడబ్ల్యూ) తాజాగా షావోమ స్మాల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును బెస్టూన్ బ్రాండ్ కింద చైనా మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ నెల నుంచే ఈ కారు ప్రి సేల్స్  ప్రారంభం కానునాయి. ఎఫ్ఏడబ్ల్యూ బెస్టూన్ షావోమ అనేది ప్రధానంగా వుల్లింగ్ హాంగుయంగ్ మిని ఈవీ కంపెనీకు ప్రధాన పోటీ దారు అని చెప్పుకోవచ్చు. చైనాలో మైక్రో కారు విబాగంలో ఈ కంపెనీయే టాప్. అయితే ఇప్పుడు దీనికి పోటీ ఇవ్వడానికి ఎఫ్ఏడబ్ల్యూ బెస్టూన్ కూడా రెడీ అవుతుంది. కంపెనీ 30 వేల యువాన్ల ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకు వచ్చింది. మన కరెన్సీలో చెప్పుకుంటే ఈ కారు ధర రూ. 3.47 లక్షల నుంచి ప్రారంభం అవుతోందని చెపుకోవచ్చు. అలాగే గరిష్ట ధర రూ. 5.78 లక్షల వరకు ఉంటుంది. ఏప్రిల్ నెలలోనే షావోమ కంపెనీ షాంఘై ఆటో షో కార్యక్రమంలో ఈ కారును లాంచ్ చేసింది. హార్డ్ టాప్, కన్వర్టిబ్ వెరియంట్లో అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం హార్డ్ టాప్ వేరియంట్ మాత్రం అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. కన్వర్టిబుల్ వెర్షన్ రానున్న కాలంలో అందుబాటులోకి రానుంది. ఈ కారు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఇందులో పెద్ద స్క్వేర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఏరోడైనిక్ వీల్స్, టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. కారు ఇంటీరియర్స్ కూడా క్యూట్ గానే ఉన్నాయి. ఫ్లాట్ డ్యాష్ బోర్డ్, రోటరీ కంట్రోల్ డయల్స్, టచ్ స్క్రీన్, డ్యూయెల్ టోన్ థీమ్ డ్యాష్ బోర్డ్, స్మూత్ ఫినిష్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బెస్టూన్ షావోమ అనే ఈ కారు ఎఫ్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తయారు అయ్యింది. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు అయిన ఈవీలలో రేంజ్ 800 కిలోమీటర్ల నుంచి ఉంటుది. గరిష్టంగా 1200 కి.మి వరకు రేంజ్ లభిస్తుంది. అయితే ఈ కారులో బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలియదు. వెల్లడి కావాల్సి ఉంది. అందువల్ల ఈ కారు రేంజ్ కచ్చితంగా ఎంతనో తెలియాల్సి ఉంది. అయితే 800 కి.మి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ మైక్రో ఈవీ విషయానికి వస్తే.. ఇందులో మూడు డోర్లు ఉంటాయి. 20 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. కాగా ఇలాంటి మిని కార్లు చైనా, యూరోపియన్ మార్కెట్లలో ఎక్కువ పాపులర్ అని చెప్పుకోవచ్చు..

Post a Comment

0 Comments

Close Menu