Ad Code

నోకియా జీ42 5జీ సేల్ ప్రారంభం !


నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.560 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్, 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ అయింది. నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌లో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,599. అమెజాన్‌లో సేల్ ప్రారంభం అయింది. బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్‌తో కొంటే 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ.560 ఈఎంఐతో ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. సో పర్పుల్, సో గ్రే కలర్స్‌లో లభిస్తుంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. గొరిల్లాగ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉండగా వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ లభిస్తాయని నోకియా వెల్లడించింది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + రెండు 2మెగాపిక్సెల్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో నైట్ మోడ్, డార్క్ విజన్, ట్రైపాడ్ మోడ్, AI పోర్ట్రెయిట్, HDR, 50MP మోడ్, వాటర్‌మార్క్స్, OZO 3D ఆడియో రికార్డింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ లభిస్తుందని నోకియా చెబుతోంది. జీపీఎస్, టైప్ సీ పోర్ట్, బ్లూటూత్ 5.1 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu