Ad Code

త్వరలో నోకియా న్యూ 5జీ !


దేశీయ మార్కెట్లోకి నోకియా సంస్థ నుంచి న్యూ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. మిడ్ రేంజ్ ఆప్షన్లతో వస్తున్న ఈ ఫోన్ డిటైల్స్ రేపు వెల్లడించనున్నది. ఇంతకుముందు అమెరికా మార్కెట్లో నోకియా జీ310 5జీ, నోకియా సీ210 స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ ది బాక్స్ వర్షన్‌పై పని చేస్తాయి. స్నాప్ డ్రాగన్ 480+ 5జీ ఎస్వోసీ చిప్ సెట్ విత్ 4జీబీ రామ్ తో వస్తున్నాయి. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో 6.56 – అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (720 x1612 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. నోకియా జీ310 5జీ, నోకియా సీ210 ఫోన్లు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆటో ఫోకస్ కెమెరా, రెండు 2-మెగా పిక్సెల్ డెప్త్ మాక్రో సెన్సర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8- మెగా పిక్సలె్ సెన్సర్ @ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. నోకియా జీ310 5జీ, నోకియా సీ210 ఫోన్లు వై-ఫై 802.11 బీ/ జీ/ ఎన్/ ఏసీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ ఓటీజీ, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. మైనర్ రిపేర్ల కోసం నోకియా జీ310 5జీ ఫోన్‌లో 'క్విక్ ఫిక్స్' టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu