Ad Code

హువావే మేట్ 60ప్రో+ ఆవిష్కరణ !


ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే చైనా మార్కెట్లో హువావే మేట్ 60 ప్రో + ఆవిష్కరించింది. కొన్ని రోజుల క్రితం హువావే మేట్ 60, హువావే మేట్ 60 ప్రో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హువావే మేట్ 60 ప్రో +  ఫోన్ బ్లాక్, బీజ్ రంగుల్లో లభిస్తుంది. చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఈ ఫోన్  గ్లోబల్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న సంగతి వెల్లడించలేదు. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. హువావే మేట్ 60 ప్రో + 6.82 -అంగుళాల ఎల్పీటీఓ ఓలెడ్ డిస్ ప్లే విత్ 1.5 కే రిజొల్యూసన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. కున్‌లన్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. హార్మోనీ ఓఎస్ 4.0 వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్నది. హువావే మేట్ 60 ప్రో+  ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 40-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగా పిక్సెల్ ఆల్ట్రా మాక్రో టెలిఫొటో లెన్స్ విత్ ఓఐఎస్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. హువావే మేట్ 60 ప్రో ఫోన్ 88వాట్ల వైర్డ్ లేదా 50 వాట్ల వైర్ లెస్.. 20 వాట్ల వైర్ లెస్ రివర్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. వై-ఫై, బ్లూ టూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, 2-శాటిలైట్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu