Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, September 3, 2023

7న వివో వీ29 విడుదల ?


టీవల ‘వివో వీ29ఈ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన వివో, మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ‘వివో వీ29’ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉందని లీక్స్ వెల్లడించాయి. వివో వీ29 స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ వెల్లడించారు. భారతదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని చెప్పాడు. అయితే సరైన తేదీని మాత్రం అతడు వెల్లడించలేదు. వివో వీ29 స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంతో సహా 39 దేశాలలో అందుబాటులో ఉంటుందని వివో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ధర దాదాపు CZK 8,499 (భారత కరెన్సీలో రూ. 32,179) ఉంటుంది. వివో వీ29 స్మార్ట్‌ఫోన్‌ 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీనికి ఆటో ఫోకస్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ మరియు రింగ్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. వివో వీ సిరీస్ ఫోన్‌ల మాదిరే వీ29 స్మార్ట్‌ఫోన్‌ కూడా సన్నగా మరియు సొగసైనదిగా ఉంటుంది. 7.46mm మరియు బరువు 186 గ్రాములు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 8GB RAM మరియు 256GB స్టోరేజ్ వేరియెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వివో వీ29 స్మార్ట్‌ఫోన్‌ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇది అద్భుతమైన డిజైన్‌, సూపర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. 6.78 ఇంచెస్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇందులో ఉంటుంది. డిస్‌ప్లే రిజల్యూషన్ 1260 x 2800 పిక్సెల్‌లు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తుంది.

No comments:

Post a Comment

Popular Posts