Ad Code

జూలైలో 72 లక్షల వాట్సప్ ఖాతాలు బ్యాన్ !


దేశంలో ఆన్‌లైన్ స్కామ్‌లు గత రెండు నెలల్లో బాగా పెరిగాయి. చాలా మంది ఆందోళన చెందుతున్నారు. చాలా సందర్భాలలో.. స్కామర్‌లు వాట్సాప్ ద్వారా బాధితులను సంప్రదిస్తారు. మీరు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తాం.. ఈజీగా డబ్బు సంపాదించండి.. ఇలాంటి ప్రకటనలతో ముంచేస్తున్నారు. ఉద్యోగ ఆఫర్‌తో వారిని ప్రలోభపెడుతున్నారు. సోషల్ మీడియా కంపెనీలు ఐటి రూల్స్ 2021 ప్రకారం ప్రతి నెలా నెలవారీ యూజర్ సేఫ్టీ నివేదికను జారీ చేయాలి. జూలై నెలకు సంబంధించిన వాట్సాప్ సెక్యూరిటీ రిపోర్టు మెటా విడుదల చేసింది. కంపెనీ జూలైలో ప్లాట్‌ఫారమ్ నుంచి 72 లక్షల ఇండియన్ ఖాతాలను నిషేధించింది. జూలై 1 నుంచి 31 వరకు 72,28,000 వాట్సాప్ ఖాతాలను నిషేధించగా, ఎలాంటి ఫిర్యాదు లేకుండానే 31,08,000 ఖాతాలను నిషేధించామని కంపెనీ తెలిపింది. కంపెనీ తన స్వంత పర్యవేక్షణలో ఈ ఖాతాలను నిషేధించింది. దేశంలో 550 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది వాట్సప్. జూలై నెలలో కంపెనీకి రికార్డు స్థాయిలో 11,067 ఫిర్యాదులు అందాయి. వాటిలో కంపెనీ 72పై చర్య తీసుకుంది. “ఎకౌంట్ ఆక్షన్డ్” అనేది రిపోర్టు ఆధారంగా కంపెనీ నివారణ చర్యలు తీసుకుంది. గతంలో నిషేధించబడిన ఖాతాను పునరుద్ధరించడం వంటి వాటిని సూచిస్తుంది. వాట్సాప్ అందించిన సమాచారం ప్రకారం, యూజర్ సేఫ్టీ రిపోర్ట్ కంపెనీకి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి. ప్లాట్‌ఫారమ్‌ను సురక్షితంగా ఉంచడానికి కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియజేసింది.

Post a Comment

0 Comments

Close Menu