Ad Code

రేపటి నుంచి మోటో జీ 84 5 జీ సేల్ !


మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో జీ84 5 జీ  సేల్ రేపు మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం లెథర్ డిజైన్, స్టన్నింగ్ డిస్ప్లే మరియు హెవీ 12GB ర్యామ్ తో తీసుకు వచ్చింది. భారీ లాంచ్ అఫర్ ను కూడా మోటోరోలా అందించింది. ఈ ఫోన్ ను మీరు Flipkart మరియు Motorola అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. Moto G84 5G స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ను మోటోరోలా అందించింది. Moto G84 5G స్మార్ట్ ఫోన్ మంచి కలర్స్ అందించగల Vivid 120 Hz రిఫ్రెష్ రేట్ 10-Bit pOLED డిస్ప్లేని 6.5 ఇంచ్ పరిమాణంతో కలిగి వుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ Snapdragon 695 5G ప్రోసెసర్ జతగా 12GB RAM తో మంచి పెర్ఫార్మెన్స్ అందించ గలదు. ఈ మోటో ఫోన్ 14 5G Bands కు సపోర్ట్ చేస్తుంది మరియు వేగవంతమైన 5G ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. 50MP OIS మెయిన్ కెమేరా, 8MP సెకండరీ కెమేరా వుంది. ఈ ఫోన్ లో 16MP Front Camera ను కూడా సెల్ఫీల కోసం మోటోరోలా అందించింది. ఈ లేటెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్ Android 13 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ లో లీనమయ్యే స్పీకర్లను Dolby Atmos మరియు Moto Spatial Sounds సపోర్ట్ తో అందించింది. 5000 mAh బిగ్ బ్యాటరీని 30W టర్బో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వుంది. 

Post a Comment

0 Comments

Close Menu