Ad Code

కొత్తగా ముస్తాబవుతున్న గూగుల్ క్రోమ్‌ !


గూగుల్ క్రోమ్ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త లుక్, ఫీచర్లు అందించడానికి సిద్ధమయ్యింది. న్యూ అప్‌డేట్‌తో గూగుల్‌కు చెందిన మెటీరియల్ యూ లాంగ్వేజ్ ఆధారంగా క్రోమ్ మోడ్రన్‌గా, స్టైలిష్‌గా మారనుంది. మరికొద్ది వారాల్లో ఈ అప్‌డేట్ అందుబాటులోకి వస్తుందని గూగుల్ బ్లాగ్ పోస్ట్ వెల్లడించింది. గూగుల్ క్రోమ్ కొత్త అప్‌డేట్ ద్వారా యూజర్లకు కస్టమైజబుల్ కలర్స్, కంప్రహెన్సివ్ మెనూ, రీడిజైన్డ్‌ క్రోమ్ వెబ్ స్టోర్, మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లను అందించనుంది. మొదటగా గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్ వెర్షన్ రీడిజైన్ లుక్ పొందుతుందని గూగుల్ బ్లాగ్ వెల్లడించింది. ఈ రీడిజైన్‌లో ఐకాన్స్ మరింత స్పష్టంగా, చదవడానికి సులభంగా ఉంటాయి. కొత్త కలర్ పాలెట్స్ కూడా రిలీజ్ అవుతాయి. దీనర్థం బ్రౌజర్ కలర్స్ యూజర్ రూపొందించిన మెటీరియల్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటాయి, అంటే అవి మరింత వైబ్రెంట్, కన్సిస్టెంట్‌గా ఉంటాయి. ఐకాన్స్, ట్యాబ్‌ల కలర్స్ కూడా ఒకే లాగా మారి మరింత అట్రాక్టివ్ లుక్ అందిస్తాయి. గూగుల్ ఆండ్రాయిడ్ 12తో మెటీరియల్ యూ డిజైన్ లాంగ్వేజ్‌ని పరిచయం చేసింది. ఈ డిజైన్ లాంగ్వేజ్ యూజర్లు వారి డివైజ్‌ల కలర్స్, లుక్, యానిమేషన్లు, విడ్జెట్‌లు కస్టమైజ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. కొత్త క్రోమ్ అప్‌డేట్‌తో గూగుల్ మెటీరియల్ యూను క్రోమ్‌ కి కూడా తీసుకువస్తోంది, కాబట్టి యూజర్లు బ్రౌజర్ కలర్, ఐకాన్స్, ఇతర ఎలిమెంట్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. టూల్‌బార్, ట్యాబ్‌ల రంగులను సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్త క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్‌లో మరింత డీటైల్డ్ మెనూ సైతం ఉంటుంది. ఇందులో ఎక్స్‌టెన్షన్స్, హిస్టరీ, డౌన్‌లోడ్స్‌, సెట్టింగ్స్‌, గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ వంటి ముఖ్యమైన ఫీచర్లను చాలా ఈజీగా, ఫాస్ట్‌గా యాక్సెస్ చేయవచ్చు. క్రోమ్ వెబ్ స్టోర్ కూడా AI-బేస్డ్ ఎక్స్‌టెన్షన్స్, ఎడిటర్‌ల సెలక్షన్ వంటి సరికొత్త సెక్షన్లతో రీడిజైన్ లుక్ పొందుతుంది. హానికరమైన వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయడంలో దాని సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్‌ను క్విక్ & ఎఫెక్టివ్‌గా మార్చేయడానికి గూగుల్ దానిని మెరుగుపరుస్తుంది. గూగుల్ తెలిసిన హానికరమైన సైట్‌ల లిస్ట్‌తో వెబ్‌సైట్లను పేరు చేయడానికి కొత్త ఫీచర్ రియల్-టైమ్ చెక్స్ ఉపయోగిస్తుంది. ఇది హానికరమైన వెబ్‌సైట్లను గుర్తించి బ్లాక్ చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మాల్వేర్, ఫిషింగ్ బెదిరింపుల నుంచి ప్రొటెక్షన్‌ను 25% మెరుగుపరుస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu