Ad Code

ఆపిల్ కు చైనా దెబ్బ !


చైనా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కంపెనీల అధికారులు ఐ-ఫోన్' వాడకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ సంగతి బయటకు రావడంతో రెండు రోజుల్లో ఆపిల్ షేర్లు 6.8 శాతం నష్టపోయాయి. అమెరికాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లలో ఆపిల్ స్టాక్ భారీగా అమ్మకాల ఒత్తిడికి గురైంది.  రెండు రోజుల్లో సంస్థకు 200 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అమెరికా తర్వాత ఆపిల్ ఐఫోన్లకు అతిపెద్ద మార్కెట్ కావడంతోపాటు అతిపెద్ద గ్లోబల్ ప్రొడక్షన్ బేస్‌గా చైనా ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ రంగం కుప్పకూలింది. మరోవైపు, ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ఫెడ్ రిజర్వ్ ట్రెజరీ బాండ్ల విక్రయం పెరిగిపోవడంతో ఆపిల్ కష్టాలు పెరిగాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన చైనా చిప్స్, మెగా క్యాప్ టెక్నాలజీ తదితర సంస్థల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. నాస్‌డాక్‌లో ఆపిల్ స్టాక్ ఒకశాతం నష్టపోయింది.

Post a Comment

0 Comments

Close Menu