Ad Code

వివో స్మార్ట్‌ఫోన్స్ ధర మరోసారి తగ్గింపు !



వివో రెండు స్మార్ట్‌ఫోన్స్ ధర మరోసారి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలనే వివో వై100, వివో వై100 ఏ ఫోన్ ధరను తగ్గించేసింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు ఎలా తగ్గాయి. వివో వై100 ఫోన్ ధర రూ. 23,999గా ఉంది.  వివో వై100ఏ ఫోన్ ధర రూ. 25,999గా ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు మరోసారి ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరను తగ్గించేసింది. ఇప్పుడు వివో వై100 ధర రూ. 21,990 నుంచి ఉంది. ఇక వివో వై100ఏ ధర రూ. 23,999 నుంచి ప్రారంభం అవుతోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ , ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బీఓబీ వంటి బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొంటే అదనంగా రూ. 2 వేల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే ఎంపిక చేసిన ఫైనాన్స్ భాగస్వాముల ద్వారా ఈ వివో స్మార్ట్‌ఫోన్స్ కొంటే.. జీరో డౌన్ పేమెంట్ సర్వీసులు కూడా పొందొచ్చు. వివో వీ షిల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా లభిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో 6.38 అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, ఫన్‌టచ్ ఓఎస్ 13, 64 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్పీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వివో వై100 ఫోన్‌లో మీడియాటెక్ డిమెన్‌సిటీ 900 ప్రాసెసర్ ఉంటుంది. ఇక వివో వై100 ఏ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉటుంది.

Post a Comment

0 Comments

Close Menu