Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, September 12, 2023

ఓపెన్ఏఐపై ఫెడరల్ కోర్టులో ఏఐపై రచయితలు దావా


గత ఏడాది నవంబర్‌లో ఓపెన్ఏఐ ఇంటరాక్టివ్ ఏఐ టూల్‌ను లాంఛ్ చేసినప్పటి నుంచి టెక్ ప్రపంచంలో చాట్‌జీపీటీపై హాట్ డిబేట్ నడుస్తోంది. చాట్‌జీపీటీకి దీటుగా టెక్ దిగ్గజాలు బార్డ్‌, బింగ్ వంటి ఏఐ టూల్స్‌ను లాంఛ్ చేశాయి. చాట్‌జీపీటీ అడ్వాన్స్ వెర్షన్లను కూడా ఓపెన్ఏఐ లాంఛ్ చేసింది. రోజురోజూకూ ఏఐ టూల్ అప్‌గ్రేడ్‌లతో యూజర్లకు చేరువవుతోంది. మరోవైపు రచయితల అనుమతి లేకుండానే వారి రచనలను ఓపెన్ఏఐ వాడుకుంటోందని అవార్డు గ్రహీతలైన పలువురు రచయితలు చాట్‌జీపీటీ పేరెంట్ కంపెనీ ఓపెన్ఏఐపై భగ్గుమంటున్నారు. ఓపెన్ఏఐపై రచయితలు న్యాయపరమైన చర్యలు చేపట్టారు. రచయితల అనుమతి లేకుండానే చాట్‌జీపీటీ ట్రైనింగ్‌లో తమ కంటెంట్‌ను వాడటం పట్ల రచయితలు ఓపెన్ఏఐపై గుర్రుగా ఉన్నారు. పులిట్జర్ బహుమతి విజేత మైఖేల్ చబన్ సహా పలువురు అమెరికన్ రచయితలు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో ఏఐపై దావా వేశారు. చాట్‌జీపీటీ శిక్షణలో తమ రచనలను ఓపెన్ఏఐ దుర్వినియోగం చేస్తోందని రచయితలు ఆరోపిస్తున్నారు. చబన్‌తో పాటు నాటకరచయిత డేవిడ్ హెన్రీ వాంగ్‌, మ్యాధ్యూ క్లామ్‌, రఖేల్ లూయిస్‌, వాల్డ్‌మన్ వంటి రచయితలు ఓపెన్ఏఐపై చర్యలు చేపట్టాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. మానవ టెక్ట్స్ ప్రాంప్ట్‌లకు చాట్‌జీపీటీ బదులిచ్చేందుకు తమ అనుమతి లేకుండానే తమ వర్క్‌ను ఓపెన్ఏఐ కాపీ చేసిందని రచయితలు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment

Popular Posts