Ad Code

ఇండియాలో సహా పలు దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్ డౌన్ !


న్‌స్టాగ్రామ్ మంగళవారం ఉదయం ఇండియా సహా పలు దేశాల్లో డౌన్ అయింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో వేలాది మంది ఆండ్రాయిడ్ యూజర్స్ దాన్ని వాడలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు సైన్ ఇన్ కూడా చేయలేకపోయారు. 42 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు సర్వర్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొన్నారని 'డౌన్‌ డిటెక్టర్' వెబ్ సైట్ తెలిపింది. 36 శాతం మందికి యాప్‌లో సమస్యలు తలెత్తగా, 22 శాతం మంది యూజర్స్ వారి ఫీడ్‌లను చూడలేక పోయారని పేర్కొంది. సెప్టెంబరు 11న (సోమవారం) సాయంత్రం 04:53 గంటలకు ప్రారంభమైన ఈ అంతరాయం సెప్టెంబర్ 12న  ఉదయం 5 గంటల సమయానికి బాగా పెరిగిందని వివరించింది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ యూజర్స్ ఈ సమస్యతో బాగా ప్రభావితమయ్యారని నివేదించింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్‌లతో సహా పలు ప్రధాన నగరాల యూజర్స్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ సమస్యలు తలెత్తాయని డౌన్‌ డిటెక్టర్ వివరించింది. ఇక చాలామంది ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ ఈ సమస్యపై ట్వీట్స్ చేశారు. ''ఫీడ్ రీఫ్రెష్ కావడం లేదు, స్టోరీస్ లోడ్ కావడం లేదు, రీల్స్ లోడ్ కావడం లేదు,  ఇన్ స్టాగ్రామ్ డౌన్ అయింది'' అంటూ నెటిజన్స్ పోస్టులు పెట్టారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటా ఈవివరాలను ఇంకా ధ్రువీకరించలేదు.

Post a Comment

0 Comments

Close Menu