Ad Code

ఈ వాచ్‌లో చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్‌ వచ్చేస్తుంది !


వాచీలలో  ఇప్పటి దాకా 360 డిగ్రీలు తిరిగిన గంటల ముల్లుకు భిన్నంగా ఇందులో 220 డిగ్రీల కోణం మాత్రమే ఉంటుంది. అదే 'సింట్రీ కర్వెక్స్‌ రిట్రోగ్రేడ్‌ అవర్‌ టర్బిలాన్‌' వాచ్‌. ఫ్రాంక్‌ ముల్లర్‌ సంస్థ తయారుచేసిన ఈ వాచీలో రెండుసార్లు ఆరు అంకె ఉంటుంది. అంటే 5.59 వరకూ సవ్యదిశలోనే గంటల ముల్లు తిరుగుతుంది. తర్వాత తన దిశను మార్చుకుని మళ్లీ తొలి ఆరు దగ్గరికి వెళ్తుంది. ఇలా గంటల ముల్లు కేవలం 220 డిగ్రీల కోణంలోనే పరివర్తనం చెందుతుంది. ఇక, ఫ్రాంక్‌ ముల్లర్‌ సంస్థ విలాసాన్ని చూపించేలా ఈ గడియారం కేస్‌ చుట్టూ వజ్రాలను పొదిగారు. రంగురంగుల్లో అంకెలను ఉంచడంతో వాచీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. బెల్టులు కూడా ఆకట్టుకునేలా విభిన్న రంగుల్లో దొరుకుతున్నాయి. ఇక వాచీలో ఎన్ని చిన్నెలద్దినా 24 గంటలకు మించి సమయాన్ని ఒక్క గంటా పెంచలేం అనుకోండి. ఈ లగ్జరీ గడియారం franckmuller.comలో లభిస్తుంది. ప్రైస్‌ ఆన్‌ రిక్వెస్ట్‌ అంటున్నారు తయారీదారులు. అందాల ఆల్చిప్పలను నగల తయారీలో వాడటం కొన్నేండ్ల నుంచీ చూస్తున్నాం. లాకెట్లూ చెవిపోగులు, ఉంగరాల్లాంటివీ ఈ తరహాలో రూపొందుతున్నాయి. గడియారాల డయల్‌గానూ ఆల్చిప్పలను వాడుతున్నారు. ఇందులో ఒక అరుదైన రకం.. అబలాన్‌. ఆకుపచ్చ, నీలం వర్ణాల మేళవింపుగా హానత్‌ సింగ్‌ జువెలరీ సంస్థ రూపొందించిన ఉంగరం కళ్లను కట్టిపడేసేలా ఉంది. అబలాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో మంచి ముత్యం మధ్యలో ఉంచి, చుట్టూ వజ్రాలు పొదిగి, రంగు రంగుల రత్నాలను వేలాడదీసి దీన్ని ముస్తాబు చేశారు. వెడల్పుగా గొడుగులా కనిపించే అడుగు బాగాన్నీ నాజూకైన తీగల డిజైన్లలో రూపొందించారు. స్టేట్‌మెంట్‌ రింగ్‌ తరహాలో కనిపిస్తున్న దీన్ని hanutsingh.com వెబ్‌సైట్‌లో కొనుక్కోవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu