Ad Code

జూమ్‌ మీటింగ్‌లో 'నోట్స్' ఫీచర్‌ ?


జూమ్ వీడియో కాల్స్‌ సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్‌ చేయడానికి అనుమతించే 'నోట్స్' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నోట్స్‌ జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్‌ స్క్రీన్‌పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్‌లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్‌కి మారే పని లేకుండా ఈ నోట్స్‌లో రాసుకోవడం, ఎడిట్‌ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్‌ చేసిన లేదా ఎడిట్‌ చేసిన నోట్స్‌ను జూమ్‌ మీటింగ్‌లో పాల్గొన్న వారికి షేర్‌ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్‌ పార్టీ డాక్యుమెంట్స్‌ను, టూల్స్‌ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్‌ఫారమ్‌లోనే ఉంటూ మీటింగ్‌ అజెండాలు, ఇతర నోట్స్‌ తయారు చేసుకునేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జూమ్‌ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్‌ మీటింగ్‌ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్‌ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్‌ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్‌ చేయవచ్చు. మీటింగ్‌ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్‌ను ఇతరులకు షేర్‌ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్‌లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్‌లు, టెక్ట్స్‌ కలర్స్‌ వంటి ఆప్షన్‌లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్‌లను, లింక్‌లను యాడ్‌ చేయవచ్చు. ఈ నోట్స్‌ ఎప్పటికప్పడు ఆటోమేటిక్‌గా సేవ్‌ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Post a Comment

0 Comments

Close Menu