Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label techology. Show all posts
Showing posts with label techology. Show all posts

Sunday, September 24, 2023

థ్రెడ్స్‌ యాప్‌లో ఎడిట్ ఫీచర్ !


X (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌కు పోటీగా మెటా థ్రెడ్స్‌ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ అప్లికేషన్ మొదట్లో టెక్ వరల్డ్‌లోనే హాట్ టాప్‌గా మారింది. కానీ కాలక్రమేణా యాప్ ట్రాఫిక్, ఎంగేజ్‌మెంట్ 75 శాతానికి పైగా తగ్గిపోయింది. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు థ్రెడ్స్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు పోస్ట్‌లను షేర్ చేసిన 5 నిమిషాలలోపు ఎడిట్ చేసుకునే ఫెసిలిటీని ఆఫర్ చేస్తోంది. X ఇప్పటికే పోస్ట్ ఎడిటింగ్‌ సదుపాయాన్ని అందిస్తుంది. కాకపోతే ఆ ఫీచర్ X ప్రీమియం సబ్‌స్క్రైబర్‌ల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్‌లను పోస్ట్ చేసిన గంటలోపు ఎడిట్ చేసుకోవచ్చు. అయితే వినియోగదారులందరికీ పోస్ట్ ఎడిటింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించాలని థ్రెడ్స్‌ యోచిస్తోంది. థ్రెడ్స్‌లో కొత్త ఎడిట్ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను ప్రముఖ లీకర్, డెవలపర్ అలెశాండ్రో పలుజ్జీ తాజాగా షేర్ చేశారు. అందులో ఎడిట్ బటన్ కనిపించింది. ఈ స్క్రీన్‌షాట్‌కు క్యాప్షన్‌గా "5 నిమిషాలలోపు పోస్ట్‌లను ఎడిట్ చేసుకోగల సామర్థ్యంపై థ్రెడ్స్‌ పని చేస్తోంది." అని జత చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్ చేసిన క్యాప్షన్‌లను ఎలా చూపుతుందో, అదే విధంగా పోస్ట్‌కు చేసిన ఎడిట్ హిస్టరీ కూడా యూజర్లు చూడగలుగుతారని పలుజ్జీ తెలిపారు. అయితే ఈ ఫీచర్ యూజర్లకు ఇంకా అందుబాటులో రాలేదు, భవిష్యత్తులో రిలీజ్ కావచ్చు. మెటా అధికారికంగా ఎడిట్ పోస్ట్ ఫీచర్‌ను ప్రకటించలేదు. ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మోస్సేరి ఈ ఏడాది జులై నెలలో మాట్లాడుతూ.. పోస్ట్‌లను ఎడిట్ సామర్థ్యంతో సహా థ్రెడ్స్‌ కోసం హ్యాష్‌ట్యాగ్స్‌, సెర్చ్, డైరెక్ట్ మెసేజ్‌లు, క్రోనాలాజికల్ ఫీడ్ వంటి కొత్త ఫీచర్‌లపై మెటా పనిచేస్తోందని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఎడిట్ ఫీచర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ట్విట్టర్ లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌, ట్రెండింగ్ పేజీని పరిచయం చేయడానికి థ్రెడ్స్‌ డెవలపర్లు పనిచేస్తున్నారని కూడా మోస్సేరి చెప్పారు. యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అవ్వకుండా థ్రెడ్స్‌ ప్రొఫైల్‌ను డిలీట్ చేసుకునే ఫెసిలిటీని అందించాలని మెటా సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో రిపోర్ట్స్ వచ్చాయి. ఇదే నిజమైతే, ఇన్‌స్టా-థ్రెడ్స్‌ అకౌంట్ లింక్‌ను విమర్శించిన యూజర్లు సంతోషిస్తారు. ట్విట్టర్ లాగా థ్రెడ్స్‌లో ఎక్కువ మంది వ్యక్తులు అనామక అకౌంట్లను క్రియేట్ చేయడానికి కూడా ఈ ఫెసిలిటీ దారితీయవచ్చు. థ్రెడ్స్ యాప్ లాంచ్ అయిన కొత్తలో పది కోట్ల యాక్టివ్ యూజర్స్ ఉంటే, ఇప్పుడు ఈ సంఖ్య రెండు కోట్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫస్ట్ డేస్‌లో దీనికి బాగా హైప్‌ రావడంతో కోట్లమంది యూజర్లు అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. సరైన ఫీచర్లు లేక, యాప్ ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో యూజర్లు మళ్ళీ ఎక్స్(X)కే షిఫ్ట్ అవుతున్నారు.

Sunday, September 17, 2023

మ్యాగ్నెట్ కారుపై భారీ తగ్గింపు ఆఫర్లు !


నిస్సాన్ ఇండియా అందిస్తున్న మ్యాగ్నెట్ కారుపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. కంపెనీ ఈ నెలలో కారుపై ఏకంగా రూ. 97,100 వరకు తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది. ఇందులో పీఎంపీ ఆఫర్ కింద రూ. 12,100 వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఇంకా యాక్ససిరీస్ లేదా క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 20 వేల వరకు తగ్గింపు ఉంది. ఇంకా ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 40 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.10 వేల వరకు తగ్గింపు ఉంది. ఇలా మొత్తంగా రూ. 97 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ కారు కొనేందుకు సులభంగానే లోన్ పొందొచ్చు. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంది. వడ్డీ రేటు 6.99 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. నిస్సాన్ ఫైనాన్స్ ద్వారా ఈ ఫెసిలిటీ పొందొచ్చు. 24 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు.డీల్స్ ఈ నెల వరకే అందుబాటులో ఉంటుంది. ఎంచుకునే కారు వేరియంట్ ఆధారంగా కూడా కారు ఆఫర్‌లో మార్పులు ఉంటాయి. అలాగే డీలర్‌షిప్ ఆధారంగా కూడా కారు ఆఫర్ మారొచ్చు.  ఈ కారు ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్60


వెగ్ ఆటోమొబైల్స్ కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకువచ్చింది. ఇది హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని పేరు ఎస్60. అలాగే రానున్న కాలంలో ఈ ఎస్60 స్కూటర్‌కు అప్‌గ్రేడ్ వేరియంట్ కూడా లాంచ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. వెగ్ ఎస్60 స్కూటర్ ధర రూ. 1.25 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఇది బ్లాక్, గ్రే, వైట్, గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఫుల్ కావడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఫుల్‌గా చార్జింగ్ పెడితే ఏకంగా 120 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ పరవ్ 2.5 కేడబ్ల్యూ. దీని టాప్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్లు. అలాగే ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, కాంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, త్రి రైడ్ మోడ్స్ వంటివి ఉంటాయి. హైడ్రాలిక్ సస్పెన్షన్, వైడర్ సీటు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కంపెనీ ఇందులో ఇంకా 90-100/10 ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చింది. కంపెనీ మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అందిస్తోంది. వెగ్ ఎస్25, వెగ్ ఎల్25 అనేవి ఇవి. అయితే ఇవి లో స్పీడ్ స్కూటర్లు. అంటే వీటి స్సీడ్ గంటకు 30 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. రూ. 1.25 లక్షల ధరలో చూస్తే.. వెగ్ ఎస్60 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఏథర్ 450 ఎస్, ఓలా ఎస్ 1 ఎయిర్ వంటి వాటిని గట్టి పోటీ ఇవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి. మీరు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రూ. 2,100 మొత్తంతో మీరు ముందుగానే ఈ స్కూటరను ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పుకోవచ్చు.

Saturday, September 2, 2023

జూమ్‌ మీటింగ్‌లో 'నోట్స్' ఫీచర్‌ ?


జూమ్ వీడియో కాల్స్‌ సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్‌ చేయడానికి అనుమతించే 'నోట్స్' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నోట్స్‌ జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్‌ స్క్రీన్‌పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్‌లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్‌కి మారే పని లేకుండా ఈ నోట్స్‌లో రాసుకోవడం, ఎడిట్‌ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్‌ చేసిన లేదా ఎడిట్‌ చేసిన నోట్స్‌ను జూమ్‌ మీటింగ్‌లో పాల్గొన్న వారికి షేర్‌ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్‌ పార్టీ డాక్యుమెంట్స్‌ను, టూల్స్‌ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్‌ఫారమ్‌లోనే ఉంటూ మీటింగ్‌ అజెండాలు, ఇతర నోట్స్‌ తయారు చేసుకునేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జూమ్‌ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్‌ మీటింగ్‌ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్‌ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్‌ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్‌ చేయవచ్చు. మీటింగ్‌ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్‌ను ఇతరులకు షేర్‌ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్‌లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్‌లు, టెక్ట్స్‌ కలర్స్‌ వంటి ఆప్షన్‌లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్‌లను, లింక్‌లను యాడ్‌ చేయవచ్చు. ఈ నోట్స్‌ ఎప్పటికప్పడు ఆటోమేటిక్‌గా సేవ్‌ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Popular Posts