'ఇండియా ఏఐ ప్రోగ్రామ్' లో భాగంగా భారీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల క్లస్టర్‌ను ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోంది. జీపీయూలతో కూడిన కంప్యూటర్ల సముదాయాన్ని జీపీయూ క్లస్టర్ అని పిలుస్తారు. ఇందులో ప్రతి నోడ్‌కు జీపీయూ అనుసంధానమై ఉంటుంది. వీటి ద్వారా ఇమేజ్, వీడియో ప్రాసెసింగ్‌లో న్యూరల్ నెటవర్క్‌లకు ట్రైనింగ్ ఇస్తారు. ఏఐ యాప్స్ కోసం చిప్ లను డిజైనింగ్ చేసి అందించే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు జీపీయూ క్లస్టర్ దోహదం చేస్తుంది. ఇందుకోసం రూ.1100-1200 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది. ప్రత్యేకించి ఆరోగ్యం, విద్య, వైద్యం, పాలనా వ్యవహారాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను ఏఐకు అనుసంధానం చేసే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను రెడీ చేయాలనే విజన్ తో కేంద్రం ముందుకు సాగుతోంది. ఈక్రమంలోనే గుజరాత్‌లోని సనంద్ లో రూ.22,540 కోట్లతో మైక్రాన్ కంపెనీకి చెందిన సెమీకండక్టర్ ప్యాకేజింగ్, అసెంబ్లింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నారు. ఇందులో రూ.6760 కోట్లు ప్లాంట్ నిర్మాణానికి కేటాయిస్తారు. ఈ ప్లాంట్ 2024 చివర్లో అందుబాటులోకి వస్తుంది.
0 Comments