Ad Code

స్పామ్ మెసేజ్‌లను అలర్ట్‌ చేసే ఫీచర్ !


స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను ఫేక్‌ కాల్స్‌ గురించి అలర్ట్‌ చేసేందుకు గూగుల్‌ వాయిస్‌ 'సస్పెక్టెడ్‌ స్పామ్ కాలర్ అలర్ట్స్‌' ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు స్పామ్‌ మెసేజ్‌లను కూడా గుర్తించి అలర్ట్ చేసే ఫీచర్‌ను గూగుల్‌ వాయిస్‌ లాంచ్ చేసింది. ఇప్పుడు గూగుల్ వాయిస్‌ యూజర్లకు SMS ఇన్‌బాక్స్‌లో అనుమానిత స్పామ్ మేసేజ్ వస్తే ప్రొఫైల్ అవతార్ స్పాట్‌లో రెడ్‌ ఎక్స్‌క్లమేషన్‌ సింబల్‌ చూపుతుంది. మెసేజ్‌ ప్రివ్యూలో సులభంగా గుర్తించేందుకు సరిపోలే రంగులో 'సస్పెక్టెడ్‌ స్పామ్' అనే పదాలను కూడా డిస్‌ప్లే చేస్తుంది. యూజర్‌ సస్పెక్టెడ్‌ స్పామ్‌ లేబుల్‌తో మెసేజ్‌ రిసీవ్‌ చేసుకుంటే, రెండు ఆప్షన్‌లు ఉన్నాయి. ముందు ఆ మెసేజ్‌ను స్పామ్‌గా కన్‌ఫర్మ్‌ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్‌లో అదే నంబర్ నుంచి ఏవైనా మెసేజ్‌లు వస్తే, నేరుగా స్పామ్ ఫోల్డర్‌లోకి వెళ్తాయి. లేదా లేబుల్ చేసిన మెసేజ్‌లను స్పామ్ కాదని కూడా మార్క్‌ చేయవచ్చు. సస్పెక్టెడ్‌ స్పామ్ లేబుల్ ఆ నంబర్‌కు భవిష్యత్తులో మళ్లీ కనిపించదు. సాధారణంగానే మెసేజ్‌లు రిసీవ్‌ అవుతాయి. ఈ ఫీచర్ ఉచిత, పెయిడ్‌ గూగుల్ వాయిస్ అకౌంట్లకు (స్టార్టర్, స్టాండర్డ్, ప్రీమియర్) అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌  డివైజ్‌లకు అందుబాటులోకి రానుంది. 'మీరు గూగుల్ వాయిస్‌ని ఉపయోగిస్తుంటే, సస్పెక్టెడ్‌ స్పామ్ కాలర్ అలర్ట్స్‌ గురించి తెలుసుకుంటారు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ , ఐవోఎస్‌ డివైజ్‌లలో SMSలకు కూడా విస్తరిస్తున్నాం' అని గూగుల్ ఒక అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. కొన్ని సందర్బాల్లో హడావుడిగా, తొందరపాటుతో చేసే మెసేజ్‌లలో తప్పులు దొర్లుతుంటాయి. ఎదుటివారికి చెప్పాలనుకున్న విషయం తప్పుగా కమ్యూనికేట్ అవుతుంది. ఇలాంటి మిస్‌ కమ్యూనికేషన్‌లను నివారించేందుకు, రిటెన్‌ కమ్యూనికేషన్‌ ద్వారా బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. 9to5Google రిపోర్ట్‌ ప్రకారం, బీటా టెస్టర్ల కోసం గూగుల్‌ జీబోర్డ్‌లో AI- పవర్డ్ 'ప్రూఫ్‌రెడ్' ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. Gboard వెర్షన్ 13.4తో కీబోర్డ్ టూల్‌బార్‌లో ప్రూఫ్‌రీడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. జనరేటివ్‌ ఏఐ సహాయంతో వినియోగదారులు రియల్‌- టైమ్‌లో స్పెల్లింగ్, గ్రామర్‌ ఎర్రర్స్‌ కోసం టెక్స్ట్‌ను చెక్‌ చేసుకోవచ్చు. రిటెన్‌ కమ్యూనికేషన్‌ని డెవలప్‌ చేయడానికి ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu