Ad Code

వాట్సాప్‌ లో పాస్‌కీ ఫీచర్ !


వాట్సాప్ లో పాస్‌వర్డ్‌లను ఉపయోగించకుండానే అకౌంట్‌కు లాగిన్ చేయడానికి పాస్‌కీ ని తీసుకురాబోతోంది. యూజర్ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి ఫోన్‌లోని ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ స్కానర్‌ని ఉపయోగిస్తుంది. దీన్నే పాస్‌కీ అంటారు. ఇది పాస్‌వర్డ్‌ల కంటే సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. గూగుల్ , యాపిల్ , మెటా వంటి కొన్ని ఇతర పెద్ద కంపెనీలు కూడా వాటి సేవల కోసం ఆల్రెడీ పాస్‌కీని ఉపయోగిస్తున్నాయి. వాట్సాప్ ఇంకా అందరికీ పాస్‌కీని విడుదల చేయలేదు. కొంతమంది వాట్సాప్ బీటా వెర్షన్‌ టెస్టర్లతో మాత్రమే దీనిని పరీక్షిస్తోంది. వాట్సాప్ బీటా ఇన్ఫో  ఈ ఫీచర్‌కి సంబంధించిన వివరాలను పంచుకుంది. వాట్సాప్ పాస్‌కీలు బీటా వెర్షన్‌కు రిలీజ్ అవుతున్నట్లు వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.20.4 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న కొందరు బీటా టెస్టర్లు పాస్‌కీతో అకౌంట్‌కు సైన్-ఇన్ చేయొచ్చని WABetaInfo పేర్కొంది. మరికొద్ది నెలల్లో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చు. గూగుల్ పాస్‌కీలు ఆన్-డివైజ్‌ అథెంటికేషన్ అనే ఒక రకమైన అథెంటికేషన్‌తో యూజర్ లాగిన్స్‌ను సులభతరం చేస్తాయి. ఆన్-డివైజ్‌ అథెంటికేషన్ అనేది రిమోట్ సర్వర్‌లో కాకుండా యూజర్ డివైజ్‌లోనే జరుగుతుంది. యూజర్ డేటా రిమోట్ సర్వర్‌లో స్టోర్ అవ్వదు కాబట్టి ఇది మరింత సురక్షితమైనదిగా ఉంటుంది. హ్యాక్ లేదా తస్కరించడం వంటి ప్రమాదాలు ఉండవు. వాట్సాప్ డెవలపర్స్ కూడా ఇదే పాస్‌కీ స్ట్రక్చర్ ఉపయోగిస్తారు. వాట్సాప్ పాస్‌కీలు అకౌంట్‌కు సురక్షితంగా సైన్-ఇన్ చేయడానికి ఒక కొత్త మార్గమని WABetaInfo లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది. అవి యూజర్ ఐడెంటిటీని ప్రూవ్ చేయడానికి, యూజర్ వారి సొంత డివైజ్‌లతో మాత్రమే అకౌంట్ వెరిఫై చేసుకోవడానికి అనుమతిస్తాయని తెలిపింది. "వాట్సాప్ ఖాతాకి లాగిన్ చేయడంలో సమస్య ఉంటే పాస్‌కీలతో సింపుల్‌గా లాగిన్ చేయవచ్చు. పాస్‌కీలతో, ఐడెంటిటీ వెరిఫై చేయడానికి ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ లేదా స్క్రీన్ లాక్‌ని ఉపయోగించవచ్చు." అని పేర్కొంది.


Post a Comment

0 Comments

Close Menu