Ad Code

ఇన్ఫోసిస్‌కు జరిమానా !


మెరికాలోని సీటెల్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ తమకు 1,764.84 డాలర్లు జరిమానా విధించినట్లు ఇన్ఫోసిస్ తాజాగా ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య కాలానికి స్థానిక పేరోల్ పన్నును ట్యాక్స్ అథారిటీకి తక్కువగా చెల్లించినందుకు గానూ జరిమానా విధించినట్లు ఇన్ఫోసిస్‌ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలియజేసింది. దీని వల్ల కంపెనీ ఆర్థిక విషయాలు, నిర్వహణ, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. పన్ను చెల్లింపులో లోటు కారణంగా గత నెలలో కూడా ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ నుంచి పెనాల్టీని ఎదుర్కొంది. ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ అప్పట్లో 76.92 డాలర్ల పెనాల్టీని వసూలు చేసింది. కాగా పొరపాటున అధిక పన్ను రేటు కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈ విషయంలో ముందుకు ఎలా వెళ్లాలో పరిశీలిస్తున్నామని ఇన్ఫోసిస్‌ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu