Ad Code

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లాంగ్ వెర్షన్ !


న్‌స్టాగ్రామ్ లో ఇన్ స్టా రీల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. వినియోగదారుల ఆసక్తి, వారి అవసరాలకు అనుగుణంగా కంపెనీ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈక్రమంలోనే మరో కొత్త ఫీచర్ ను ఇన్ స్టాగ్రామ్ పరీక్షిస్తోంది. అదేంటంటే మీరు ఏదైనా ఫీడ్ ను పోస్ట్ చేయాలనుకున్నప్పుడు కేవలం కొంత మంది ఫాలోవర్స్ లేదా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అది షేర్ చేసుకొనేలా ఈ ఫీచర్ ఉండబోతోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో మీరు ఏదైనా పోస్టు పెడితే మీ వాల్ పై పోస్ట్ అవుతుంది. మీ ఫాలోవర్లు, ఫ్రెండ్స్ అందరూ చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇకపై కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ కు మాత్రమే షేర్ అయ్యేలా కొత్త ఫీచర్ ఉండనుంది. ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన వివరాలను సూచించే స్క్రీన్ షాట్ ను డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఇన్ స్ట్రక్టర్ లియా హేబర్ మేన్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ అయ్యింది. అలాగే మొబైల్ డెవలపర్ అలెశాండ్రో పలుజ్జీ మే 5వ తేదీనే ఈ కొత్త అప్ డేట్ కు సంబంధించి విషయాన్నిఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అంతే గత కొంత కాలం నుంచే ఇన్ స్టా గ్రామ్ ఫీచర్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దీనిపై మెటా ప్రతినిధి ఒకరు స్పందిస్తూ కొన్ని ఎంపిక చేసిన దేశాలలో యూజర్లకు క్లోజ్ ఫ్రెండ్స్ తో ఫీడ్ పోస్ట్ లను పంచుకునే ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఇన్ స్టా లో రానున్న కొత్త ఫీచర్ ఫీడ్ పోస్టింగ్ వేగంగా, సులభంగా చేసేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. స్టోరీస్, డైరెక్ట్ మెసేజ్(డీఎంఎస్) ద్వారా ప్రస్తుతం ఇన్ స్టాలో ఫీడ్ పోస్టింగ్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని సెన్సిటివ్, లేదా వ్యక్తిగత పోస్టులను కేవలం కొంతమంది ఎంపిక చేసిన స్నేహితులు, బంధువులకు మాత్రమే పంపుకునేలా ఈ కొత్త ఫీచర్ ఇన్ స్టా తీసుకొచ్చింది. దీంతో పోస్ట్ చేసే ముందు క్లోజ్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకుంటే అది కేవలం ఎంపిక చేసిన వారికి మాత్రమే చేరుతుంది. మిగిలిన ఫాలోవర్స్ అందరికీ ఆ పోస్ట్ కనిపించదు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ ను వినియోగించుకోవాలనుకుంటే ముందుగా మీరు క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు షేర్ చేయాలనుకున్న వీడియో లేదా ఫొటోను క్లోజ్ ఫ్రెండ్స్ కు మాత్రమే వెళ్లేలా ఐకాన్ పై నొక్కడం ద్వారా వారికి మాత్రమే వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీంతో ప్రైవసీకి భంగం వాటిల్లదు.గ్లోబల్ వైడ్ గా టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలతో పోటీ పడేందుకు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లాంగ్ వెర్షన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. 10 నిమిషాల నిడివితో ఈ రీల్స్ వచ్చేలా కొత్త ఫీచర్ ను తీసుకురానున్నట్లు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu