Ad Code

సాఫ్ట్‌వేర్‌ను క్రియేట్ చేసిన ఏఐ చాట్‌బాట్స్‌ !


చాట్‌బాట్స్ టెక్ట్స్ రాయడం, సమాచారం షేర్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్‌, ప్రోగ్రామింగ్ టాస్క్‌లకు సాయపడటం, వ్యాసాలు రాయడం వంటి ఎన్నో టాస్క్‌లను ఇట్టే పూర్తిచేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. టెక్నాలజీ మెరుగవుతున్న కొద్దీ ఏఐ ఆధారిత చాట్‌బాట్స్ సామర్ధ్యాలు కూడా కొత్తపుంతలు తొక్కుతున్నాయి. క్లిష్టమైన పనులను కూడా చాట్‌బాట్స్ క్లియర్ చేస్తూ యూజర్లకు సౌకర్యవంతంగా మారాయి. ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్స్ తక్కువ మ్యాన్‌పవర్‌తో సాఫ్ట్‌వేర్ కంపెనీని సమర్ధంగా నడపగలవని, కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. చాట్‌జీపీటీ వెర్షన్ 3.5ని వాడుతూ అదనపు శిక్షణ లేకుండా కంప్యూటర్ ప్రోగ్రాం సాఫ్ట్‌వేర్‌ను సృష్టించగలదా అని పరీక్షించేందుకు బ్రౌన్ యూనివర్సిటీ, చైనీస్ యూనివర్సిటీల పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. దీనికోసం వీరు చాట్‌దేవ్ అనే కాల్పనిక కంపెనీని క్రియేట్ చేశారు. ఆపై వారు టాస్క్‌ను ప్లానింగ్‌, కోడింగ్‌, టెస్టింగ్‌, రైటింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో నాలుగు భాగాలుగా విభజించారు. టాస్క్‌ను పూర్తిచేసేందుకు కీలక సూచనలను కంప్యూటర్ ప్రోగ్రామ్స్‌కు ఇచ్చారు. చాట్‌దేవ్‌కు 70 టాస్క్‌లను ఇవ్వగా ఏడు నిమిషాల్లోపే అది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను పూర్తిచేసింది. ఇందుకు డాలర్‌లోపే ఖర్చు కావడం విశేషం. కంప్యూటర్ ప్రోగ్రాం సొంతగానే సమస్యలను గుర్తించి పరిష్కరించినట్టు పరిశోధనలో వెల్లడైంది. చాట్‌దేవ్ క్రియేట్ చేసిన సాఫ్ట్‌వేర్‌లో 86.66 శాతం పర్‌ఫెక్ట్‌గా ఉందని పరిశోధకులు గుర్తించారు.

Post a Comment

0 Comments

Close Menu