Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, September 12, 2023

వాట్సాప్ లో డిలీట్ అయిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందాలంటే !


వాట్సాప్ లో నిత్యం వేలాది మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోస్ షేర్ చేసుకుంటారు. అయితే, కొన్నిసార్లు అనుకోకుండానే కొన్ని ముఖ్యమైన ఫోటోలు, వీడియోలో డిలీట్ అవుతాయి. వాట్సాప్‌లో డిలీట్ అయిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందేందుకు ప్రస్తుతం అనేక మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా వాట్సాప్ మీడియా ఫైల్స్‌ను సులభంగా తిరిగి పొందవచ్చు. వీటిని తిరిగి పొందడానికి పెద్ద టెక్నికల్ నాలేడ్జ్ కూడా ఏమీ అవసరం లేదు. ఎవరైనా దీన్ని సులభంగా ప్రయత్నించవచ్చు.  డీఫాల్ట్‌గా వాట్సాప్‌కు సంబంధించి అన్ని ఫోటోలు, వీడియోలు ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటి ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. ఒకవేళ మీ వాట్సాప్ నుంచి వీడియో, ఫోటో, డాక్యూమెంట్ ఫైల్ డిలీట్ అయినా.. వాటిని ఫోన్ గ్యాలరీలో తిరిగి పొందవచ్చు. వాటిని మళ్లీ షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోని వాట్సాప్ ఫోల్డర్‌కు వెళ్లడం ద్వారా మీడియా ఫైల్‌ల నుండి తొలగించబడిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు. మీరు వాట్సాప్ చాట్‌లు, మీడియాను రోజువారీ, వారం, నెలవారీ ప్రాతిపదికన Google డిస్క్, iCloudకి బ్యాకప్ చేయవచ్చు. చాట్‌లు, మీడియా ఫైల్‌లు డిలీట్ అయినట్లయితే.. మీ వాట్సాప్‌ను తొలగించి, దాన్ని మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండి. వాట్సాప్ లాగిన్ సమయంలో, మీరు రికవరీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీ ఫోటోలు, వీడియోలను అన్నింటిని తిరిగి పొందవచ్చు. కొన్నిసార్లు మనం చాట్‌ని డిలీట్ చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన మీడియా ఫైల్స్ కూడా పొరపాటున డిలీట్ అవుతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాట్‌ను డిలీట్ చేసే ముందు.. డిలీట్ మీడియా ఆప్షన్‌ను టిక్ చేయకుండా ఉండండి. దీని కారణంగా చాట్‌లు డిలీట్ అయి.. మీడియా ఫైల్స్ మీ మొబైల్‌లో సేఫ్‌గా ఉంటాయి.

No comments:

Post a Comment

Popular Posts