Ad Code

చౌకైన మ్యాక్‌బుక్‌ను తీసుకురానున్న యాపిల్ ?


క్రోమ్‌బుక్స్, విండోస్ ల్యాప్‌టాప్‌లకు పోటీగా యాపిల్ చౌకైన మ్యాక్‌బుక్‌లను తయారు చేయాలని యోచిస్తోంది. 2024 ద్వితీయార్థంలో రూ.30 వేల లోపు ధరతో ఇది విడుదల కావచ్చని తెలుస్తోంది. యాపిల్ ప్రస్తుత మ్యాక్‌బుక్‌ ధర సుమారు రూ.80,000. ఇతర ల్యాప్‌టాప్స్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.  మ్యాక్‌బుక్స్‌ కంటే క్రోమ్‌బుక్స్ చౌకగా ఉంటాయి. వాటిలో చాలా వరకు రూ.30 వేల లోపే ఉంటాయి. యాపిల్ కూడా లో-కాస్ట్ మ్యాక్‌బుక్‌కు అదే ధరను నిర్ణయించొచ్చని కొందరు భావిస్తుంటారు. గతంలో అందరికీ అందుబాటులో ఉండేలా చౌక ధరల్లో ఐఫోన్ ఎస్ఈ  తీసుకొస్తామని చెప్తే మధ్యతరగతి ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. తీరా రిలీజ్ అయ్యాక బాగా డిసప్పాయింట్ అయ్యారు. రూ.30,000 లోపు ఫోన్ అందుబాటులోకి వస్తుందేమోనని వారు ఆశపడ్డారు. కానీ యాపిల్ కంపెనీ మొదటి ఐఫోన్ SE భారతదేశంలో రూ.39,000కి విడుదల చేసింది, రెండవ వెర్షన్‌ను రూ.42,500కి, ఐఫోన్ SE 3 రూ.43,900కి 2022లో రిలీజ్ చేసింది. ఈ ధరలు ఇప్పటికీ మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా భరించలేనివని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ ఫోన్లు ధరకు తగినట్లే గొప్ప ఫీచర్లను ఆఫర్ చేస్తాయి.టెక్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం యాపిల్ దాని చౌకైన మ్యాక్‌బుక్‌ను క్రోమ్‌బుక్స్‌కు కంటే కొంచెం ఎక్కువ ధరకు తీసుకురావచ్చు. అయితే ఇది ఆపిల్ ప్రొడక్ట్ అయినందున వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవచ్చు. ఎందుకంటే యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి. 


Post a Comment

0 Comments

Close Menu