Ad Code

క్రెడిట్ కార్డు పోర్టబిలిటీ ఆప్షన్ ?


వరైనా క్రెడిట్‌/డెబిట్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు అది మన చేతికి అందేదాకా ఏ కార్డు వస్తుందో తెలియదు. రూపే కార్డు ఇవ్వాలా?, మ్యాస్ట్రో, వీసా కార్డా? అన్నది బ్యాంకులే నిర్ణయిస్తాయి. అయితే  మీకు అందిన క్రెడిట్ కార్డు సేవలు సరిగా లేవని భావిస్తే ఏం చేయాలి? అనే ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఆర్బీఐ సూపర్ ఆన్సర్ ఇచ్చింది. ఈ సమస్యకు పరిష్కారంగా క్రెడిట్ కార్డ్ పోర్టబిలిటీ ఆప్షన్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ గురించి తెలిసిందే. మనం వాడుతున్న నెట్ వర్క్ సేవలు నచ్చకపోతే  అదే మొబైల్ నంబర్ మీద వేరే నెట్ వర్క్​కు మారిపోతాం. ఇక నుంచి డెబిట్‌/క్రెడిట్‌/ ప్రీపెయిడ్‌ కార్డుల విషయంలోనూ సరిగ్గా ఇలాంటి మార్పే చేయాలనుకుంటోంది రిజర్వ్ బ్యాంక్‌. దీనికి 'క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ పోర్టబిలిటీ' అని పేరు కూడా పెట్టింది. ఇది అందుబాటులోకి వస్తే వినియోగదారుడు తనకు నచ్చిన పేమెంట్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. అంటే మాస్టర్‌ నుంచి రూపేకు, వీసా నుంచి మాస్టర్‌కు ఇలా మీకు నచ్చిన కార్డు నెట్‌వర్క్‌కు మారేందుకు ఆర్‌బీఐ వెసులుబాటు కల్పిస్తోంది. ఈ పోర్టబిలిటీ సౌకర్యం అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్​బీఐ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వీసా, మాస్టర్‌ కార్డ్‌ , రూపే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, డైనర్స్‌ క్లబ్‌  వంటి సంస్థలు ఈ నెట్‌వర్క్‌ సేవలు అందిస్తున్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి ఈ సంస్థలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. దీని ప్రకారం.. వినియోగదారుడికి ఏ కార్డు జారీ చేయాలన్నది ఈ సంస్థలే నిర్ణయిస్తాయి. కానీ.. ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రకారం.. తాను ఏ కార్డు పొందాలన్నది వినియోగదారుడి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) తన తాజా ముసాయిదా సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రస్తుతం దీనిపై అభిప్రాయాలు కోరుతోంది. అక్టోబర్‌ 1 నుంచి ఈ సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు ఆర్​బీఐ సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం. ఆర్బీఐ ముసాయిదా ప్రకారం  వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా నిరోధించకూడదు. ఏదైనా కార్డ్ జారీ చేసే సంస్థ ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్‌ నెట్‌వర్క్‌లతో సంబంధాలు పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన కార్డులన్నీ జారీ చేయాల్సి ఉంటుంది. ఇందులో నచ్చిన కార్డును ఎంచుకొనే వెసులుబాటును కస్టమర్లకు కల్పించాలి. అలాగే.. ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్​కు పోర్ట్‌ చేసుకొనే అవకాశం ఉండాలి.

Post a Comment

0 Comments

Close Menu