Ad Code

హ్యందాయ్ ఎక్స్‌టర్ కారు !


హ్యందాయ్ కంపెనీ ఇటీవలనే ఈ కొత్త ఎక్స్‌టర్ కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఆఫర్డబుల్ ఎస్‌యూవీ కారు ఇదే. గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ కారును తయారు చేశారు. టాటా పంచ్, సిట్రోయెన్ సీ3 వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది. అలాగే నిస్సాన్ మ్యాగ్నెట్, రెనో కైగర్ వంటి మోడళ్లకు కూడా పోటీ ఇస్తోంది. ఎక్స్‌టర్ కారు ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే రూ. 10.10 లక్షల వరకు ధర ఉంది. ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ధర మారుతుంది. ఎక్స్‌టర్ కారు ధర హైదరాబాద్‌లో చూస్తే.. రూ. 7.23 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఆన్‌రోడ్ ధరను కలుపుకుంటే ఈ రేటుకు మీరు కారు కొనాల్సి వస్తుంది. ఇప్పుడు మీ వద్ద డబ్బులు ఉంటే ఒకేసారి కట్టొచ్చు. లేదంటే అప్పుడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి. ఈ కారును కొనుగోలు చేయడానికి బ్యాంక్ నుంచి రూ. 4 లక్షల లోన్ తీసుకున్నారని అనుకుందాం. అంటే అప్పుడు మీరు డౌన్ పేమెంట్ రూపంలో రూ. 3.23 లక్సలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు రూ. లక్షల మొత్తానికి 8.8 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే.. అప్పుడు మీకు నెలకు రూ. 6,300 వరకు ఈఎంఐ పడుతుంది. అంటే రోజుకు దాదాపు రూ.200 పొదుపు చేయాలి. 7 ఏళ్ల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. 5 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే.. అప్పుడు నెలకు రూ. 8,200 వరకు ఈఎంఐ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలా మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా మీ నెలవారీ ఈఎంఐ కూడా మారుతుంది. ఒక వేళ మీరు ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. అప్పుడు నెలవారీ ఈఎంఐ పైపైకి చేరుతుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారులో పారామెట్రిక్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ స్కిడ్ ప్లేట్, 1.2 లీటర్ ఇంజిన్, అధిక లెగ్ రూమ్, వాయిస్ ఎనెబుల్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, డ్యాష్‌క్యామ్ విత్ డ్యూయెల్ కెమెరా, 8 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, ఓటీఏ అప్‌డేట వంటి ఫీచర్లు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu