Ad Code

వర్డ్ ప్యాడ్ ను నిలిపివేయనున్న మైక్రోసాఫ్ట్ !


మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్ ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ యాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో దాదాపు 28 ఏళ్లుగా ఉంటోంది. వినియోగదారులకు బహుముఖ సేవలను అందిస్తోంది. విండోస్ వినియోగించే ప్రతి వినియోగదారుడికి వర్డ్ ప్యాడ్ పై అవగాహన ఉంటుంది. ఉచితంగా దీనిని యాక్సెస్ చేసుకొనే అవకాశం వినియోగదారులకు అందుబాటులో ఉండేది. అయితే ఇకపై దానిని పూర్తిగా నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.అది ఎప్పటి నుంచి అనేది ఇంకా ప్రకటించలేదు. ఇప్పటి వరకూ విండోస్ ఓఎస్ లో ఎన్ని అప్ డేట్లు వచ్చినా వర్డ్ ప్యాడ్ కొనసాగింది. అయితే త్వరలో రానున్న విండోస్ కొత్త అప్ డేట్లో ఈ ఉచిత వర్డ్ ప్రాసెసింగ్ యాప్ ఉండదని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిందేమిటి అంటే మైక్రోసాఫ్ట్ కి ఇప్పటికే ఆప్షనల్ వర్డ్ ప్యాడ్ అందుబాటులో ఉంది. అది విండోస్ 10 నుంచి అందుబాటులో ఉంది. ఇప్పుడు వినియోగదారులు కావాలంటే దీనిని మైక్రోసాఫ్ట్ ఆప్షనల్ ఫీచర్ల కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్లి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్ లేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా లైబర్ ఆఫీస్, జోహో డాక్స్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్, లు థర్డ్ పార్టీ వర్డ్ ప్రాసెసింగ్ యాప్స్ కూడా ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu