Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, September 10, 2023

చంద్రుడిపై కూడా ప్రకంపణలు ?


భూమితో పోలిస్తే భౌగోళికంగా చంద్రుడి నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. అక్కడ కూడా ప్రకంపణలు సంభవిస్తాయని వివరిస్తున్నారు. ఒక్కోసారి వాటి తీవ్రత భూమిపై కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇటీవల చంద్రుడి ఉపరితలంపై భారత్‌కు చెందిన విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడిపై ప్రకంపణలకు సంబంధించిన సంకేతాలను గుర్తించిందని చెప్పారు. గతంలో అమెరికాలో చేపట్టిన అపోలో 17 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ కొన్ని సిస్మోమీటర్లను వదిలి వచ్చారనీ అవి కేవలం ఐదేళ్ల మాత్రమే పనిచేశాయని చెప్తున్నారు. ఐదేళ్లలో చంద్రుడిపై సుమారు 12వేలకు పైగా ప్రకంపణలు నమోదు అయ్యినట్లు నాసా వెల్లడించింది. ఈ సిస్మోమీటర్లు అందించిన సమాచారం ఆధారంగా చంద్రుడిపై నాలుగు రకాల భూకంపాలు సంభవిస్తాయని కనుగొన్నట్లు తెలిపింది. చంద్రుడిపై అత్యంత లోతైన ప్రకంపణలు సాధారణమని, ఇవి ఉపరితలం నుంచి 700 కిలోమీటర్ల లోతు వరకు సంభవిస్తాయని అంతరిక్ష పరిశోధకులు చెప్పారు. చంద్రుడిపై ఉల్కలు ఢీ కొనడం, ఉపరితలంపై ఉష్ణోగ్రతలలో కలిగే మార్పులు తదితర కారణాల వల్ల భూకంపాలు సంభవిస్తాయని వివరించారు. తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 పాయింట్లుగా నమోదైందని తెలిపారు. ఈ భూకంపాలు 10 సెకండ్ల నుంచి 30 సెకండ్లు ఉంటాయని చెప్పారు అంతరిక్ష పరిశోధకులు. 

No comments:

Post a Comment

Popular Posts