Ad Code

డేంజరస్ DogeRAT మాల్వేర్ !


డోగెరాట్ అనే కొత్త మాల్వేర్‌తో పాపులర్ యాప్‌లకు ఫేక్ వెర్షన్లను క్రియేట్ చేసి వాటి ద్వారా వినియోగదారుల డివైజ్‌లను DogeRAT మాల్వేర్‌ తో కేటుగాళ్లు ఇన్‌ఫెక్ట్ చేస్తున్నట్లు దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లను ప్రభుత్వం  హెచ్చరించింది. ఈ మాల్వేర్ పర్మిషన్లు అవసరం లేకుండానే డివైజ్ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగలదని తెలిపింది. ఈ రిమోట్ యాక్సెస్ ట్రోజన్ బాధితుడి డివైజ్‌పై హ్యాకర్లకు రిమోట్ కంట్రోల్‌ను ఇస్తుంది. తద్వారా హ్యాకర్లు ఫైల్స్‌ను మాడిఫై చేయగలరు, కాల్ రికార్డ్స్‌ను చూడగలరు. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలను ఉపయోగించి ఫొటోలు కూడా తీయగలరు. ఈ మాల్వేర్ కాంటాక్ట్స్, మెసేజ్‌లు, బ్యాంకింగ్ క్రెడిన్షియల్స్ వంటి సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తుంది. ఇతర మాల్వేర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి కూడా ఇది హ్యాకర్లకు మార్గం సుగమనం చేస్తుంది. చాట్‌జీపీటీ, ఒపెరా మినీ బ్రౌజర్, యూట్యూబ్ ప్రీమియం వంటి ప్రముఖ యాప్‌ల ఫేక్ వెర్షన్‌ల ద్వారా హ్యాకర్లు డోగెరాట్ మాల్‌వేర్‌ను సర్క్యులేట్ చేస్తున్నారని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మాల్వేర్ గల యాప్‌ల డౌన్‌లోడ్ లింక్స్‌ను టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పంపిస్తున్నారు. హ్యాకర్లు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ హానికరమైన యాప్‌లకు లింక్‌లు సెండ్ చేస్తున్నారు. DogeRAT అనేది ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ మాల్వేర్, ఇది బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ప్రభుత్వ ఐడీలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని కూడా కొట్టేస్తుంది. బ్యాంకింగ్, ఇ-కామర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సహా పలు రంగాలలోని వినియోగదారులను ఇది లక్ష్యంగా చేసుకుంటోంది. గూగుల్ ప్లే స్టోర్ వంటి అఫీషియల్ సోర్సుల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం ఆండ్రాయిడ్ వినియోగదారులకు సూచించింది. మెసేజింగ్ యాప్‌ల ద్వారా పంపించే లింక్స్‌ ద్వారా యాప్‌లను ఇన్‌స్టాల్ చేయొద్దని హెచ్చరించింది. తెలియని వ్యక్తులు పంపిన ఈ-మెయిల్స్‌లోని లింక్స్‌ను క్లిక్ చేయవద్దని, డివైజ్ సాఫ్ట్‌వేర్‌ను అప్-టు-డేటెడ్‌గా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు మాల్వేర్ నుంచి డివైజ్‌లను రక్షించడంలో కీలక పాత్ర పోషించే సెక్యూరిటీ ప్యాచ్‌లను కలిగి ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu