Ad Code

యాపిల్ iOS 17 విడుదల


యాపిల్  అన్ని కంపాటబుల్ ఐఫోన్ల కోసం iOS 17 స్టేబుల్ పబ్లిక్ వెర్షన్‌ను అధికారికంగా రిలీజ్ చేసింది. సపోర్టెడ్ ఐఫోన్లు ఉన్న యూజర్లందరూ ఈ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకుని కొత్త ఫీచర్లను ఆస్వాదించవచ్చు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్‌, ఐఫోన్ XR, ఐఫోన్ SE (2వ తరం లేదా నెక్స్ట్ జెన్) ఫోన్లన్నీ కూడా iOS 17కి సపోర్ట్ చేస్తాయి. ఈ యాపిల్ డివైజ్‌లు వాడే యూజర్లు iOS 17 అప్‌డేట్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్టెప్ 1: ఐఫోన్‌లో సెట్టింగ్స్‌> జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ సెక్షన్‌కు వెళ్లాలి. పేజీ రిఫ్రెష్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.

స్టెప్ 2: పేజీ రిఫ్రెష్ పూర్తయ్యాక కొత్తగా 'అప్‌గ్రేడ్ టు iOS 17 (Upgrade to iOS 17)' పాపప్‌ కనిపిస్తుంది. ఇక్కడ 'డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: అవసరమైన అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి అగ్రీ చేయాలి. రిక్వెస్ట్ ప్రాసెస్ అయ్యే వరకు కొద్దిసేపు వెయిట్ చేయాలి. అప్‌డేట్ డౌన్‌లోడ్ కావడం ప్రారంభమవుతుంది.

స్టెప్ 4: డౌన్‌లోడ్ కంప్లీట్ కావడానికి ఎంత సమయం మిగిలి ఉందో సూచించే ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది.

ఐఫోన్‌లో iOS 17 అప్‌డేట్ డౌన్‌లోడ్ స్టార్ట్ చేసే ముందు క్లౌడ్‌లో లేదా కంప్యూటర్‌లో మొత్తం డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది. అలాగే ఐఫోన్‌లో కనీసం 50% ఛార్జ్ ఉండేలా చూసుకోవాలి.

WWDC 2023 బిగ్ ఈవెంట్‌లో ఐఫోన్‌ల కోసం కొత్త iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌ను యాపిల్ ప్రకటించింది. ఇది iOS 16 లాగానే కనిపిస్తోంది, కానీ కొన్ని కొత్త ఫీచర్లు ఇచ్చారు. వాటిలో స్టాండ్‌బై ఒకటి. iOS 17లోని కొత్త స్టాండ్‌బై ఫీచర్‌ను ఐఫోన్‌ ఛార్జ్ చేసేటప్పుడు యూజర్లు వాడుకోవచ్చు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఐఫోన్‌ను ఒక సైడ్‌లో ఉంచింతే స్క్రీన్‌పై టైమ్, వెదర్, ఫొటోలు లేదా క్యాలెండర్ వంటి విభిన్న విషయాలను చూడవచ్చు. స్క్రీన్‌ను స్వైప్ చేసి టైమ్, వెదర్ లాంటివి చూసుకోవచ్చు. చూడాలనుకుంటున్న వాటిని కస్టమైజ్‌ చేసుకోవచ్చు. స్టాండ్‌బై యూజర్ ఫాలో అవుతున్న గేమ్ స్కోర్ లేదా ఫుడ్ డెలివరీ ఎప్పుడు వస్తుంది వంటి ముఖ్యమైన సమాచారాన్ని కూడా చూపుతుంది. ఈ ఫీచర్ iOS 17 ఇన్‌స్టాల్ చేసుకున్న అన్ని ఐఫోన్‌లలో పని చేస్తుంది. సిరితో ఒకేసారి రెండు భాషలు మాట్లాడుకునేలా మరొక కొత్త ఫీచర్ కూడా యాపిల్ అందించింది. అలానే కొత్త అప్‌డేట్‌తో ఐఫోన్ యూజర్లు రెండు సిమ్ కార్డ్‌లను ఎన్‌హన్స్‌డ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉపయోగించవచ్చు. ఇంకా iOS 17 యూజర్ల కోసం ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu