Ad Code

సెల్ఫీ తీసుకున్న ఆదిత్య L1 మిషన్ !


సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో పంపుతున్న ఆదిత్య L1 మిషన్  అంతరిక్షంలో దూసుకెళ్తోంది. తనకు ఇస్రో నిర్దేశించిన L1 పాయింట్ వైపుగా ప్రయాణం సాగిస్తూ.. ఆ మిషన్.. సెప్టెంబర్ 4, 2023న సెల్ఫీ తీసుకుంది. అలాగే.. భూమి, చందమామను కూడా ఫొటోలు తీసింది. తాజాగా ఈ విషయాన్ని ఇస్రో తన ట్విట్టర్ అకౌంట్‌లో వీడియో రూపంలో షేర్ చేసింది. సెల్ఫీ ఫొటోలో.. VELC, SUIT అనే ఇన్‌స్ట్రుమెంట్లను మనం చూడవచ్చు అని ఇస్రో తెలిపింది. అలాగే ఆదిత్యకు ఉన్న ఆన్ బోర్డ్ కెమెరా.. భూమి, చందమామను ఫొటోలు తీసింది. ఐతే.. వరుస ఫొటోలను ఆర్డర్‌లో సెట్ చెయ్యడం వల్ల అవి వీడియో లాగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్.. ప్రస్తుతం సూర్యుడివైపుగా తన పయనం సాగిస్తోంది. ఇది దాదాపు 4 నెలలపాటూ.. ఇలాగే ప్రయాణిస్తుంది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లి.. లాగ్రాంజియన్ పాయింట్ -1 (L-1)లో చేరుతుంది. అక్కడ సూర్యుడి చుట్టూ తిరుగుతూ... ఫొటోలు తీసి, ఇస్రోకి పంపుతుంది. వాటిని ఇస్రో ట్విట్టర్ ద్వారా మనకు చూపిస్తుంది. ఆదిత్య L1 ద్వారా ఇస్రో ప్రధానంగా.. సూర్యుడి జ్వాలలు, సౌర గాలులు, ప్లాస్మా తీరు, కరోనా (ఉపరితలం) లక్షణాలు, రేడియేషన్ ప్రభావం, కాంతి మండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్) వంటి అంశాలను పరిశోధించనుంది.


Post a Comment

0 Comments

Close Menu