Ad Code

హోండా SP125 స్పోర్ట్ ఎడిషన్ విడుదల !


హోండా SP125 టూవీలర్‌ను ఈ సంవత్సరం బీఎస్-6 స్టాండర్ట్స్-2 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ సరికొత్త వెర్షన్‌ను ఈ ఏడాది మార్చిలో '2023 హోండా SP125' పేరుతో లాంచ్ చేయగా, మార్కెట్లోకి ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు దీనికి సక్సెసర్‌గా హోండా SP125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. హోండా SPR125 స్పోర్ట్ ఎడిషన్‌లో పాత తరం మోడళ్లలో వినియోగించిన అదే 123.94cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 10.72bhp పవర్‌ను, 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను తాజా BS-VI OBD-2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు. డీసెంట్ బ్లూ మెటాలిక్, హెవీ గ్రే మెటాలిక్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో వెహికల్ అందుబాటులో ఉంటుంది. బ్రైట్ LED హెడ్‌ల్యాంప్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ దీంట్లో ప్రధాన ఆకర్షణ. గేర్ పొజిషన్ ఇండికేటర్, మైలేజ్ ఇన్ఫర్మేషన్‌ను ఇది డిస్‌ప్లే చేస్తుంది. కొత్త SP125 స్పెషల్ ఎడిషన్ 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజీ (3 సంవత్సరాల ప్రామాణిక వారంటీ, 7 సంవత్సరాల ఆప్షన్‌)తో అందుబాటులో ఉంటుంది. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త SP125 స్పోర్ట్ ఎడిషన్‌ ధరను రూ. 90,567గా నిర్దేశించింది. ఈ కొత్త మోటార్‌సైకిల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో పరిమిత కాలానికి మాత్రమే, అంటే ఫెస్టివల్ సీజన్‌ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బోల్డ్ అప్పీల్, మోడ్రన్ ఎక్విప్‌మెంట్‌తో ఈ వెహికల్ అడ్వాన్స్‌డ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కొత్త బైక్ లాంచింగ్ సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మథుర్ చెప్పారు. SP125 లైనప్‌లో లేటెస్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందన్నారు. కొత్త SP125 స్పోర్ట్స్ ఎడిషన్ కస్టమర్లను, ముఖ్యంగా యువ తరాన్ని మరింత ఆకర్షిస్తుందని చెప్పారు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈఓ సుట్సుము ఒటాని. అయితే పండుగ సీజన్ తర్వాత ఈ బైక్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

Post a Comment

0 Comments

Close Menu