Ad Code

నీటిలో, పర్వతాలపై, రోడ్ పై పరిగెత్తే YangWang U8


మార్కెట్లో ఉన్న ఇతర SUVల కంటే ఈ చైనీస్ SUV భిన్నమైన అనేక లక్షణాలను కలిగి వుంది. ఈ SUVకి YangWang U8 అని పేరు పెట్టారు. వాహనాలలో చాలా అరుదైనదిగా కనిపిస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ SUV నీటిలో 1 నుంచి 1.5 అడుగుల వరకు మునిగి, తేలుతూ ఉండగలదు. ఈ SUV చుట్టూ కెమెరాలు ఇన్‌స్టాల్ చేశారు. ఇవి బయటి నుంచి ప్రత్యక్ష ఫుటేజీని క్యాబిన్‌లోని డిస్‌ప్లేకు పంపుతాయి. ఈ SUV ధర దాదాపు రూ.1.5 కోట్లు ($1.50 లక్షలు) ఉంటుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ SUV 4 మోటార్లు, ప్లగ్ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది, ఇది 1180 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనిని E-4 ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించింది, తద్వారా ఈ వాహనం 4 చక్రాలపై ప్రత్యేక టార్క్, స్టీరింగ్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ కారును పార్క్ చేసిన చోట అలాగే ఉంచి.. చుట్టూ తిరిగేలా చెయ్యవచ్చు. అందువల్ల పార్కింగ్‌లో దీన్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు, తిరిగి తీసుకోవచ్చు. ఈ SUVకి 'ట్యాంక్' అనే టైటిల్ పెట్టారు, ఎందుకంటే ఇది అన్ని రకాల ఉపరితలాలపైనా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ దీనికి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను సెట్ చేసింది. ఇది కారు పరిధిని పెంచుతుంది. 49kWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 76 లీటర్ ఇంధన ట్యాంక్ కూడా SUVలో ఉంది. బ్యాటరీ మోడ్‌లో దీనిని ఫుల్లుగా ఛార్జ్ చేశాక, 1,000 కిలోమీటర్ల వరకు నడపవచ్చని కంపెనీ తెలిపింది. ఈ SUV కేవలం 18 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేయగల ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని కలిగి ఉంది. నీటిలో కదులుతున్నప్పుడు కారు లోపలికి నీరు రాకుండా దీని తలుపులు, ఇతర అన్ని పాయింట్లూ మూసివుంటాయి. కారులో అమర్చిన బ్యాటరీని.. అవసరమైతే ఇతర పరికరాలకు శక్తినివ్వడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది 15 కంటే ఎక్కువ డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది, ఇది వివిధ పరిస్థితులకు అనుగుణంగా కారును నడపడానికి వీలు కల్పిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu