Ad Code

వివో ఎక్స్‌100, వివో ఎక్స్‌100 ప్రొ !


వివో నెక్ట్స్ జనరేషన్ ఎక్స్ సిరీస్ ఫోన్లను లాంఛ్ చేస్తోంది. వివో ఎక్స్‌100, వివో ఎక్స్100 ప్రొ లాంఛింగ్‌కు ముందే టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇంప్రెసివ్ వివో ఎక్స్‌ 90 సిరీస్‌కు కొనసాగింపుగా పొటోగ్రఫీ ఫీచర్లలో మెరుగుదలతో కస్టమర్ల ముందుకు రానున్నాయి. అధికారిక లాంఛ్ డేట్ ఇంకా వెల్లడి కాకున్నా చైనీస్ టెక్ నిపుణుడు ఈ స్మార్ట్‌ఫోన్ల కెమెరా, హార్డ్‌వేర్ ఫీచర్ల గురించి వెల్లడించాడు. వివో ఎక్స్‌100 సిరీస్ అద్భుతమైన కెమెరా ఫీచర్లతో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. వెనిలా వివో ఎక్స్ 100 సోనీ ఐఎంఎక్స్‌920తో కూడిన రియర్ కెమెరా సెటప్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. క్రిస్ప్‌, వైబ్రంట్ షాట్స్‌ను క్యాప్చర్ చేస్తూ మెరుగైన ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ప్రైమరీ సెన్సర్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అల్ట్రా వైడ్ షాట్స్ కోసం శాంసంగ్ జేఎన్ 1 లెన్స్ వాడటంతో యూజర్లకు అద్భుతమైన అనుభూతి సొంతమవుతుంది. ఇక కెమెరా సెటప్‌లో ఓమ్నివిజన్ ఓవీ64బీ టెలిఫొటో కెమెరాను 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో జోడించడం ద్వారా దూరంలోని సబ్జెక్ట్‌ను క్యాప్చర్ చేసేందుకు స్టన్నింగ్ జూమ్ క్యాపబిలిటీస్‌ను అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu