Ad Code

దేశీయ మార్కెట్లో త్వరలో రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌ !


దేశీయ మార్కెట్లో రెడ్‌మీ నుంచి రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనుంది. కొన్ని వారాల క్రితం ఈ ఫోన్లు చైనాలో లాంచ్‌ అయ్యాయి. ఈ సంవత్సరం చివర నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ఫోన్ సింగపూర్‌ IMDA సర్టిఫికేషన్‌లో లిస్టింగ్‌ అయిన తర్వాత కొరియా నేషనల్‌ రేడియా రీసెర్ట్‌ ఏజెస్సీలో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ 2312RA50G నంబర్‌తో అక్టోబర్‌ 16న సర్టిఫికేషన్‌ పొందినట్లు సమాచారం. రెడ్‌మీ నోట్‌ 13, నోట్‌ 13 ప్రో, 13 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు ఈ ఫోన్‌ 30000 రూపాయల కంటే తక్కువ సెగ్మెంట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 CPU మరియు అడెన్నో 710 GPU ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు MIUI 14 ఆధారంగా పనిచేయనుందని తెలుస్తోంది. 67W ఛార్జింగ్‌ సపోర్టుతో 5100mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ వెనుకవైపు 200MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌ తాజాగా BIS సర్టిఫికేషన్‌ పొందినట్లు తెలుస్తోంది.



Post a Comment

0 Comments

Close Menu