ఇండియాలోని స్మార్ట్‌ఫోన్‌ల యూజర్ల కోసం ఐక్యూ ఫన్‌టచ్ OS 14 పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 7న రిలీజ్ అయిన ఈ అప్‌డేట్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని అన్ని ఫీచర్లు, అలానే కొన్ని ఐక్యూ స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ అప్‌డేట్‌తో ఐక్యూ స్మార్ట్‌ఫోన్లు మరింత మెరుగ్గా పర్ఫార్మ్ చేస్తాయని కంపెనీ వెల్లడించింది. తొలుత ఐక్యూ 11 స్మార్ట్‌ఫోన్‌లలో రిలీజైన ఈ OS 2023 చివరి నాటికి ఇతర ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లలోనూ అందుబాటులోకి రానుంది. ఈ OS మెమరీ మేనేజ్‌మెంట్, మల్టీ టాస్కింగ్ కేపబిలిటీస్, పర్సనలైజేషన్, ప్రైవసీ, సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తుంది. కొత్త వీడియో ఎడిటింగ్ టూల్స్ కూడా ఆఫర్ చేస్తుంది. ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మరియా తాజాగా మాట్లాడుతూ..'ఐక్యూ స్మార్ట్‌ఫోన్ల యూజర్లకు స్మూత్, ఫాస్టెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు కంపెనీ చాలా కృషి చేస్తోంది. ఫోన్లను మరింత పర్సనలైజ్డ్‌గా మార్చడానికి ఐక్యూ లక్ష్యంగా పెట్టుకుంది. లేటెస్ట్ అప్‌డేట్ అయిన ఫన్‌టచ్ OS 14 ఆ దిశగా ఒక పెద్ద అడుగు.' అని అన్నారు. స్మూత్ ఎన్విజన్ ఫీచర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎల్లప్పుడూ రన్ అయ్యే యాప్‌ల సంఖ్యను తగ్గించడం ద్వారా ఫోన్‌ని ఫాస్ట్‌గా రన్ అయ్యేలా చేస్తుంది. ఫోన్ తక్కువ ర్యామ్‌ని ఉపయోగించేలా చేసి ఇతర యాప్‌లను రన్ చేయడానికి ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది. యాప్ రిటైనర్ ఫీచర్‌తో యూజర్లు ఇష్టమైన యాప్‌లను ఓపెన్ చేసి చాలాసేపు ఉంచుకోవచ్చు. వాటిని కొద్దిసేపు యూజ్ చేయకపోయినా అవి ఓపెన్ అయ్యే ఉంటాయి. దీని ఫలితంగా మళ్లీ కావాలనుకున్నప్పుడు అవి లోడ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, త్వరగా వాటిని యాక్సెస్ చేయవచ్చు. మల్టీ టాస్కింగ్ ఫన్‌టచ్ OS 14తో బ్యాక్‌గ్రౌండ్‌లో చిన్న విండోలలో గరిష్టంగా 12 యాప్‌లను ఉంచుకోవచ్చు. వాటి మధ్య సులభంగా స్విచ్ కావొచ్చు. విండోస్ సైజు అడ్జస్ట్ కూడా చేయవచ్చు. వీడియోలను ఒరిజినల్ క్వాలిటీతో, సెకనుకు 60 ఫ్రేమ్‌ల వద్ద గరిష్టంగా 4K రిజల్యూషన్‌తో ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోల క్వాలిటీ కొంచెం కూడా కోల్పోకుండా ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్‌లో యాప్‌లను ఓపెన్ చేసి, క్లోజ్ చేసినప్పుడు ఈ ఫీచర్ ఫోన్‌ను స్మూత్‌గా కనిపించేలా చేస్తుంది. కొత్త స్మార్ట్ మిర్రరింగ్ ఫీచర్‌తో నోటిఫికేషన్ బార్‌లోని ఎలాంటి పర్సనల్ ఇన్ఫో బయట పెట్టకుండా స్క్రీన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాక్ స్క్రీన్‌పై క్లాక్ స్టైల్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కొత్త క్లాక్ స్టైల్‌ని ఆల్వేస్ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే స్టైల్‌ల నుంచి ఎంచుకోవచ్చు.
ఫన్‌టచ్ ఓఎస్ 14 రిలీజ్ చేసిన ఐక్యూ !
0
October 08, 2023
Tags