ఈ ఏడాది చివర్లో కొత్త సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను విడుదల చేయడానికి షియోమీ ప్లాన్ చేస్తోంది. షియోమీ 14 సిరీస్‌లో షియోమీ 14, షియోమీ 14 ప్రో, షియోమీ 14 అల్ట్రా వంటి మూడు మోడల్స్ ఉంటాయని టెక్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇండియన్ టెక్నాలజీ వెబ్‌సైట్ 91మొబైల్స్ తో సహా పోలిష్ టిప్‌స్టర్ స్టీవ్ హెమెర్‌స్టోఫర్ A.k.a ఆన్‌లీక్స్ షియోమీ 14 ప్రోకి సంబంధించిన కొన్ని ఇమేజ్‌లను లీక్ చేశారు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలు 14 ప్రో ఫోన్ ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే షియోమీ 14 ప్రో మొబైల్ నాలుగు కెమెరాలు, డ్యూయల్ స్పీకర్స్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. లీక్ అయిన పిక్స్ ప్రకారం షియోమీ 14 ప్రో మునుపటి షియోమీ 13 ప్రోతో పోలిస్తే చాలా డిఫరెంట్ డిజైన్‌తో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఉన్న కెమెరా మాడ్యూల్ చాలా కొత్తగా కనిపించింది. కెమెరా మాడ్యూల్ చాలా పెద్దది, మునుపటి వెర్షన్ కంటే ఎక్కువ కెమెరాలు, సెన్సార్లతో అడ్వాన్స్డ్‌గా కనిపించింది. షియోమీ 14 ఫోన్ ఇంప్రూవ్డ్ కెమెరా క్వాలిటీ, ఫీచర్లతో వస్తుందని ఈ మాడ్యూల్‌ను చూస్తే అర్థమవుతుంది. టిప్‌స్టర్ ప్రకారం, కెమెరా మాడ్యూల్ 13.1mm ఎత్తు వరకు ఉంటుంది. కర్వ్డ్ స్క్రీన్‌కు బదులుగా ఫ్లాట్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED 2.5D డిస్‌ప్లేతో ఇది రావచ్చు. దీని స్క్రీన్ సైజ్ 6.6 అంగుళాలు, దీనిలో సెల్ఫీ కెమెరా కోసం చిన్న పంచ్-హోల్ ఉంటుంది. ఫోన్ మునుపటి మోడల్ కంటే కొంచెం మందంగా ఉంటుంది. ఫోన్ కొలతలు 161.6 x 75.3 x 8.7 మిమీ. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో లాంచ్ అవ్వచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ చిప్‌సెట్ ఇంకా లాంచ్ అవ్వలేదు. ఇది ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఈ అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 120W ఫాస్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,860mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుందని సమాచారం.
షియోమీ 14 ప్రో ఫోటోలు లీక్ !
0
October 16, 2023
Tags